Begin typing your search above and press return to search.

మద్రాసు హైకోర్టు జడ్జిపై అభిశంసనా? పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం

విపక్ష ఎంపీల తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలు సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి.

By:  Garuda Media   |   10 Dec 2025 12:30 PM IST
మద్రాసు హైకోర్టు జడ్జిపై అభిశంసనా? పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
X

తమిళనాడులోని ఒక కొండపై ఉన్న దీపస్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించే విషయంలో అక్కడి దర్గా కమిటీకి.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు (ఇండియా కూటమికి చెందిన) తాజాగా లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు.

విపక్ష ఎంపీల తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలు సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. పవన్ కల్యాణ్ తరచూ చెప్పే సనతాన ధర్మానికి సంబంధించిన అంశాల్ని తన వాదనలో ప్రస్తావించటం చూస్తే.. రాబోయే రోజుల్లోఈ ఇష్యూ మరింత రాజుకోవటం ఖాయమన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారు? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. మరింత క్లియర్ గా.. క్లారిటీగా ఉంటుందని చెప్పాలి. దీనికి ముందు అసలు వివాదం ఏమిటన్నది సింఫుల్ గా చెప్పేసి.. ఆ తర్వాత పవన్ స్పందనను చదివితే విషయంపై మరింత క్లారిటీ వస్తుంది.

అసలు వివాదం ఇదే

తమిళనాడులోని తీరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పు ఇచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించొచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి హైకోర్టు న్యాయమూరతిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ లేఖను అందించారు.

ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఇండి కూటమి పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తన వాదనను వినిపించారు.

- హిందూ విశ్వాసాలను.. ఆచారాలను పాటించటం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపు ఇవ్వటాన్ని ఏమనాలి?

- కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు.. సంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించటం కాదా?

- ఇది సూడో సెక్యులరిజం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

- సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదంపై అక్కడి శతబ్దాల ఆచారాలను వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా ఏ న్యాయమూర్తీ అభిశంసనకు గురి కాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నారే తప్ప.. న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానాలు చేయలేదు.

- ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒక కేసులో ‘‘మీరు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైనందున ఏం చేయాలో ఆ దేవుడినే అడగండి.. ఆయన్నే ప్రార్థంచండి’’ అని వ్యాఖ్యానించనప్పుడు ఏ జవాబుదారీతనమూ లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. తాజాగా తమిళనాడు ఉదంతంలో రాజకీయ వ్యవస్థ అందుకు భిన్నంగా స్పందిస్తోంది.

- ఒక సీనియర్ జడ్జి హిందువుల దీర్ఘకాలిక విశ్వాసాలను పాటించేందుకు అనుకూలంగా తీర్పును ఇస్తే..ఆయన్ను అభిశంసించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ వైఖరి భయానక వివక్షను చాటుతోంది. ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు అన్నిస్వరాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.