కూటమితో పవన్ డిఫర్ అవుతున్నారా ?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. 164 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో టీడీపీకి సొంతంగా 135 మంది ఉన్నారు.
By: Satya P | 2 Aug 2025 11:00 PM ISTఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. 164 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో టీడీపీకి సొంతంగా 135 మంది ఉన్నారు. అలా చూస్తే టీడీపీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది అయితే కూటమి కట్టారు కాబట్టే ఇన్ని సీట్లు దక్కాయన్న వాదన ఉంది. ఇక మిత్రపక్షాలుగా జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక చూస్తే ఏపీలో కూటమి పాలన 15 నెలలు పూర్తి చేసుకుంటోంది. అంటే ప్రజలు ఇచ్చిన అధికారంలో పావు వాటా పూర్తి అయింది అన్న మాట.
పవన్ మౌనం వెనక :
పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకంగా ఉన్నా కూడా మౌనంగా ఉంటున్నారు. ఎందువల్ల అంటే దాని మీద రకరకాలైన ప్రచారం సాగుతోంది తమకు ఇష్టపడని కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయన అసంతృప్తి అయితే ఉందా అన్నది మరో చర్చ. అమరావతి రాజధాని కోసం రెండో విడత భూసేకరణను జనసేన వ్యతిరేకించింది అని ఈ మధ్యనే ప్రచారం సాగింది. దాని మీద పవన్ కూడా మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు రైతుల నుంచి అభ్యంతరాలు లేకపోతే తీసుకోవచ్చు అని ఆయన నర్మగర్భంగా చెప్పారు. అయితే రైతులు రెండవ దశలో భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నది మరో ప్రచారంగా ఉంది అలా రైతుల మనసెరిగే పవన్ కేబినెట్ మీటింగులో ఈ భూసేకరణ మీద తన అభిప్రాయం చెప్పారని కూడా ప్రచారం సాగింది.
లూలూకు భూముల విషయంలో :
లూలూ అనే సంస్థలు పెద్ద ఎత్తున విశాఖ విజయవాడలో భూములు ఇస్తున్నారు అయితే ఒక ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున ఇవ్వడమేంటి అన్నది ఇపుడు చర్చగా ఉంది. దీని మీద అనేకరకాలైన అభ్యంతరాలు వెలువడుతున్నాయి. వాపక్షాలు వైసీపీ సహా విపక్షాలు ఈ భూ వితరణను తప్పుపడుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ సైతం లూలూకు ఆర్టీసీకి చెందిన స్థలాలు ఇవ్వడం పట్ల సంతృప్తిగా ఉన్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. పెద్ద ఎత్తున అంతటా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈ ఇష్యూ మీద కూడా పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
అత్యంత విలువైన స్థలంలో :
విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత విలువైన స్థలం ఒక ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం అది కూడా 99 ఏళ్ళ పాటు లీజుకు ఇవ్వడం మీద అయితే చర్చ ప్రజాక్షేత్రంలో సాగుతోంది దీంతో పవన్ ఈ విషయం మీద కూడా తనకు ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వానికి చెబుతారా అన్నది అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది. ఇక నాలా నాలా చట్ట సవరణను జనసేన వ్యతిరేకిస్తోంది అన్న ప్రచారం సాగుతోంది.
ప్రాధాన్యత లేదని కూడానా :
పేరుకు ఉప ముఖ్యమంత్రి కానీ పవన్ కి ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత లేదని జనసైనికులలో వినిపిస్తోంది. అంతా టీడీపీ గానే కధ సాగిపోతోంది. ఎక్కడ చూసినా చంద్రబాబు లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా టీడీపీ ఆలోచనలుగానే ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం అంటే సంకీర్ణ ప్రభుత్వం కింద లెక్క. కానీ మిత్రుల నుంచి సలహాలు ఏ మేరకు వస్తున్నాయి, వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుంటోంది ఏ విధంగా అమలు చేస్తోంది అన్న చర్చ కూడా ఉంది.
వ్యతిరేకత పడకుండానేనా :
ఏ ప్రభుత్వం అయినా తీసుకునే అన్ని నిర్ణయాలూ ప్రజామోదం పొందవు. అయితే టీడీపీ అజెండా వేరుగా ఉంది ప్రపచం రాజధాని గా అమరావతిని చూపించాలని తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో భూసేకరణకు పూనుకుంటోంది. కానీ పెద్ద ఎత్తున భూములు తీసుకోవడం వల్ల రైతాంగం ఇబ్బందులో పడుతుంది అన్నది మరో వైపు చర్చగా ముందుకు వస్తోంది. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల కూడా వ్యతిరేకత వస్తోంది అని అంటున్నారు. అయితే ఈ వ్యతిరేకత తమ మీద పడకుండా ఉండేందుకు పవన్ తగిన సందర్భాలలో అభ్యంతరాలు అయితే చెబుతున్నారు అని అంటున్నారు మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
