వివాదాస్పద అంశంలో పవన్ పేరు తెస్తూ టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు ప్రజాదరణ కలిగిన రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్నారు.
By: Satya P | 21 Oct 2025 12:30 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు ప్రజాదరణ కలిగిన రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆయన ఆ విధంగా చూస్తే ఎంతో ఆకర్షణ ఉంటుంది. అయితే పవన్ పేరుని ఎవరో ఒకరు ఏదో సందర్భంలో తెస్తూనే ఉంటారు. అవి మంచి విషయాల మీదనే అయితే ఫర్వాలేదు, వివాదాస్పద అంశాలలో కూడా ఆయన పేరు తెస్తూ క్లెయిమ్ చేయడం అంటే పవన్ ని ఇరకాటంలో పెట్టినట్లే. అంతే కాదు ఆయన ఇమేజ్ కూడా ఈ విధమైన కామెంట్స్ వల్ల ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు
రోజా మీద అసభ్యంగా :
చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వైసీపీ హయాంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా మీద విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు అసభ్యకరమైన తీరులో మాట్లాడారు. రోజా క్యారెక్టర్ నే కించపరచే విధంగా ఆయన వాడిన భాష కూడా ఉందని అంతా అన్నారు. అత్యంత జుగుప్సాకరంగా పదాలు వాడుతూ ఆయన రోజా మీద విరుచుకుపడ్డారు. దాని మీద రోజా కన్నీరు పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం అయితే బండారు ని అరెస్ట్ చేసింది కానీ ఆ వెంటనే ఆయన రిలీజ్ కూడా అయ్యారు. అయితే తాజాగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో బండారు మాట్లాడుతూ ఆనాటి విషయాలను మళ్ళీ తలచుకున్నారు
పవన్ మద్దతు ఇచ్చారంటూ :
అప్పట్లో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ రోజా ఎపిసోడ్ లో తనకు మద్దతుగా నిలిచారు అని బండారు షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ఆయన ఒక హొటల్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉంటూండగా తన దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నారని చెప్పారు. మీరు ధైర్యంగా ఉండాలని కూడా ఆయన తనకు చెప్పారని బండారు అంటున్నారు. అయితే బండారు ఈ కామెంట్స్ చేయడంతో వైసీపీ శ్రేణుల నుంది తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బండారు అయితే రోజా ఎపిసోడ్ లో బాధితుడు కానే కాదని అసభ్య పదజాలం బండారు ఆనాడు వాడి రోజాను అన్ని విధాలుగా విమర్శించి ఆమె కన్నీటికి కారణం అయ్యారని గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి బండారుకి పవన్ ఓదార్పు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏమి ఘనకార్యం చేశారని బండారుని కౌగిలించుకుని మరీ అభినందించారని నిలదీస్తున్నారు. అంతే కాదు తప్పు చేసి అరెస్ట్ అయి ఆ వెంటనే బెయిల్ మీద వచ్చేసిన ఆయనను ధైర్యంగా ఉండమని పవన్ ఎలా చెప్పారని అంటున్నారు.
మహిళల మీద అదేనా :
పవన్ కళ్యాణ్ కి మహిళల పట్ల ఎంతో అభిమానం ఆదరణ ఉందని అంతా అంటారని అలాంటిది రోజా ఒక మహిళ అని చూడకుండా నానా దుర్బాషలు ఆడిన బండారుని పవన్ ఎలా అభినందిస్తారు అని అంటున్నారు. బండారు వైపే పెద్ద తప్పు ఉందని అయినా ఆయనను పవన్ వెనకేసుకుని రావడమేంటని అంటున్నారు. తన తల్లి విషయంలో శ్రీరెడ్డి అప్పట్లో విమర్శలు చేసిందని బాధపడిన పవన్ మహిళలను ఎవరైనా అంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన పవన్ నిబద్ధత రోజా విషయంలో ఏమైంది అని అంటున్నారు. పైగా రోజా ఒక సినీ నటి హీరోయిన్ అని చెబుతున్నారు.
మెగా ఫ్యామిలీతో కలసి :
ఇక రోజా చూస్తే కనుక మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం కలిగి ఉన్న వారని చెబుతున్నారు. ఆమె మినిస్టర్ గా అయిన వెంటనే చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారని చెబుతున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీని తన సొంత కుటుంబంగా ఆమె భావిస్తారని మెగాస్టార్ తో ఎన్నో సినిమాలు కూడా చేశారని అంటున్నారు. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన పవన్ తన సినీ ఫీల్డ్ కే చెందిన రోజాను దారుణంగా బండారు విమర్శలు చేస్తే మెచ్చుకోవడమేంటి అని వైసీపీ నేతలు మండుతున్నారు.
మహిళలను ఎవరన్నా తప్పే :
అప్పట్లో చంద్రబాబు సతీమణి పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారని దానిని అంతా ఖండించారని గుర్తు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మహిళల విషయంలో ఎవరు నోరు జారినా ఖండించాల్సిందే అని అంటున్నారు. ఇక పవన్ కి ఈ బాధ్యత ఇంకా ఎక్కువ ఉందని అలాంటిది ఆయన బండారు చేసిన అనుచిత కామెంట్స్ ని ఎలా సమర్ధిస్తారు అని అంటున్నారు. బండారు ఆనాటి విషయాలు రివీల్ చేయడంతో ఇపుడు మళ్ళీ ఇష్యూ అయింది. మరి పవన్ దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఆయన ఇమేజ్ కే ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.
