Begin typing your search above and press return to search.

దళపతి విజయ్ కి జనసేనాని ఇచ్చిన సలహా ?

అతను దళపతి. ఇతను సేనాని. ఇద్దరూ మంచి సారధులే. ఇద్దరికీ రధాలు జోరుగా నడపడం వచ్చు. రాజకీయాలలో దూకుడు చేయడం వచ్చు.

By:  Satya P   |   13 April 2026 10:26 PM IST
దళపతి విజయ్ కి జనసేనాని ఇచ్చిన సలహా  ?
X

అతను దళపతి. ఇతను సేనాని. ఇద్దరూ మంచి సారధులే. ఇద్దరికీ రధాలు జోరుగా నడపడం వచ్చు. రాజకీయాలలో దూకుడు చేయడం వచ్చు. వెండి తెర మీద ఆరాధ్య దైవాలుగా అభిమానులను ఆకట్టుకున్న ఈ ఇద్దరికీ నిండుగా సినీ గ్లామర్ ఉన్నా ఇంకా ఎన్నో సినిమాలు చేసేంత అవకాశం ఉన్నా రాజకీయాలను ఎంచుకుని ఆ రూట్లోకి రావడం అన్నది గొప్ప విషయం. ఒడిదుడుకుల రాజకీయం ఎలా ఉంటుందో పవన్ పన్నెండేళ్ళ జనసేన ప్రస్థానంలో పూర్తిగా చవి చూశారు. మరి దళపతి విజయ్ చూస్తే ఈ ఏడాదే రాజకీయాల్లోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన పవన్ తమ సినీ రంగానికే చెంది తనలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి సలహాలు సూచనలు ఇస్తారా అన్నది అందరిలోనూ ఉన్న ప్రశ్న. అయితే దానిని నేరుగా జెన్ జెడ్ పవన్ కే సంధించింది.

వెల్ కం చెబుతూనే :

జనసేన విత్ జెన్ జెడ్ అని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాల్గొన్న అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన జవాబు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతే కాదు ఆలోచింపచేసేలా ఉంది. పవన్ ఒక విధంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీని స్వాగతించారు సామాజం మీద విశేష ప్రభావం చూపించగలిగిన వ్యక్తులు ప్రజా సేవలోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతూ అలా వచ్చిన వారిని అభినందిస్తున్నాను అని విజయ్ విషయంలో తన వైఖరిని చెప్పేశారు.

ఆయన సమర్థుడు అంటూ :

అదే సమయంలో విజయ్ సమర్ధుడు అని కూడా పవన్ కొనియాడడం విశేషం. విజయ్ పెద్ద హీరో అని ఎలాంటి భేషజం లేకుండా పవన్ చెప్పుకొచ్చారు. ఆయనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు తాను సాధారణంగా ఎవరికీ ఎలాంటి సలహా సూచనలు ఇవ్వను అని తన వైఖరి కూడా చెప్పేసారు. అదే సమయంలో ఆయన అన్యాపదేశంలో సలహావా లేదా సూచనా అన్నది తెలియదు కానీ విజయ్ కే అన్నట్లుగా లేదా జనరల్ గా అనుకున్నా కూడా ఒక విషయం చెప్పారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రజా సేవలో ఎవరైనా పనిచేయాలి అని. అంటే టార్గెట్లు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారు అయితే అవి ఫెయిల్ అయితే నిరాశలో పడి ఇబ్బందులు అవుతారు అన్నది కూడా పవన్ మాటల వెనక ఉన్న ఆంతర్యం అనుకోవాల్సి ఉంది.

తన జీవితాన్నే :

ఇక తన రాజకీయ జీవితాన్నే అన్వయిస్తూ పవన్ ఈ సలహా చెప్పారు అనుకోవాలి. ఎందుకంటే 2014లో పవన్ అసలు పోటీ చేయలేదు. పైగా తాను సపోర్టు చేసిన టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఆనాడు ఆయన కోరుకుంటే తగిన పదవి వచ్చేది. కానీ పవన్ అయిదేళ్ళ పాటు ఏ పదవీ హోదా లేకుండానే తన రాజకీయం చేశారు. ఇక 2019లో అయితే సొంతంగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. ఇక 2024 లో కూడా రాజకీయంగా బేరసారాలు ఆడేందుకు స్కోప్ ఉన్నా కూడా ఎంత తగ్గాలో అంతలా తగ్గి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు చూశారు. ఇక తనకు ఇష్టమైన శాఖలనే తీసుకుని వాటిలో అనుభవం సంపాదిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. ఇలా పవన్ తన రాజకీయ జీవితమే స్పూర్తిగా ఎవరైనా తీసుకోవచ్చు అన్నట్లుగానే ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు. నిజంగా ఈ విధంగా ఆలోచిస్తే సినీ సెలిబ్రిటీస్ కి అయినా లేదా ఇతరులకు అయినా లాంగ్ టెర్మ్ పొలిటికల్ లైఫ్ ఉంటుంది. బహుశా అదే విజయ్ కి పవన్ ఇచ్చిన అతి గొప్ప సలహా అని భావించవచ్చేమో.