Begin typing your search above and press return to search.

పవన్ మ్యానరిజంతో రఘురామ... నవ్వాగలేదుగా

ఈ సందర్భంగా సభా స్థానంలో ఉన్న ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు పవన్ మీద కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు ప్లాస్టిక్ సమస్య ఈ రోజున పెద్దదిగా ఉంది.

By:  Satya P   |   19 Sept 2025 10:50 PM IST
పవన్ మ్యానరిజంతో రఘురామ... నవ్వాగలేదుగా
X

పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా మారిన సినీ నటుడు. ఆయనకు అపారమైన అభిమాన జనం మద్దతు ఉంది. ఆయన వెండి తెర మీద పవర్ ఫుల్ స్టార్. ఇక ఆయన జనసేన అధినేతగా ఒక్క పిలుపు ఇస్తే చాలు దాని ప్రభావం ఏ రేంజిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక అసెంబ్లీలో దీని మీదనే కొంతసేపు సరదా సంభాషణ జరిగింది. ఉప సభాపతి సీట్లో రఘురామ క్రిష్ణం రాజు ఉన్నారు. పవన్ అంటే ఆయనకు ఎంతో చనువు అభిమానం. దాంతో ఆయన అదే ప్రేమతో పవన్ కి ఒక రిక్వెస్ట్ చేసారు. దాంతో పవన్ తో పాటు సభలో ఉన్న వారు అంతా నవ్వులతో సభలో అహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.

పవన్ కోరిక అది :

ప్లాస్టిక్ భూతం అన్నది ఎంతలా మానవ జీవితాన్ని తినేస్తుందో అందరికీ తెలుసు అంటూ పవన్ సభలో చెప్పుకొచ్చారు. దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్లాస్టిక్ ని వీలైనంత వరకూ సాధారణ జీవితానికి దూరంగా పెట్టాలని ఆయన కోరడం విశేషం. ఈ విషయంలో ప్రజలలో ఎంతో అవగాహన ఉండాలని ఆయన అన్నారు. అపుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.

మీకే సాధ్యం అంటూ :

ఈ సందర్భంగా సభా స్థానంలో ఉన్న ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు పవన్ మీద కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు ప్లాస్టిక్ సమస్య ఈ రోజున పెద్దదిగా ఉంది. అందువల్ల దీని మీద ప్రజలలో అవగాహన పెరగాలి అంటే మీకే సాధ్యమని అన్నారు. ప్రకటనలు ఇప్పించేందుకు టాప్ స్టార్స్ ని కోట్లు వెచ్చింది ప్రభుత్వం చేయలేదని రఘురామ అన్నారు. అందువల్ల పవన్ తానుగానే ఈ ప్రకటనలు చేసి జనాలకు చైతన్యం కలిగించాలని ఆయన కోరారు.

సైన్యం ఉదంటూ :

అంతే కాదు పవన్ ఒక్క పిలుపు ఇస్తే చాలు జనంలోకి వచ్చి పనిచేసే సైన్యం ఉందని రఘురామ అన్నారు. గతంలో రోడ్లకు పడిగ గుంతలకు తీయాలి అని పవన్ పిలుపు ఇస్తే సైన్యం బయటకు వచ్చి పూడ్చిదని ఆయన గుర్తు చేశారు. ఇపుడు కూడా పవన్ కాలరెగసేసి తన మ్యారిజంతో ఒక్క మాట చెప్పారు అంటే జనసైన్యం అంతా చూసుకుంటుందని రఘురామ సూచించారు. పవన్ వల్లనే ఈ ప్లాస్టిక్ భూతానికి అంతం అయ్యేందుకు ఆస్కారం ఉందని ఆయన తెగ పొగిడారు.

నవ్వేసిన పవన్ :

అయితే పవన్ రఘురామ చెప్పిన మాటలను అలా నవ్వుతూనే విన్నారు. తనదైన స్టైల్ లో ఆయన దానిని స్వీకరించారు. కానీ సభలో మాత్రం రఘురామ వ్యాఖ్యలకు నవ్వులు పూసాయి. ప్రత్యేకించి ఆయన పవన్ కాలరెగరేసి తన ఫ్యాన్స్ కి చెప్పాలంటూ తాను స్వయంగా చేసిన మ్యానరిజం కి సభలో అంతా నవ్వులు చిందించారు పవన్ కూడా గట్టిగానే నవ్వారు మొత్తానికి సభలో ఇది ఒక అహ్లాదకరమైన సంఘటనగా నిలిచింది అని చెప్పాలి.