Begin typing your search above and press return to search.

పిఠాపురం సమీక్షలో పవన్ ఏం చెప్పారంటే ?

పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. ఆయన 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అది కూడా బంపర్ మెజారిటీతో.

By:  Satya P   |   28 July 2026 9:10 AM IST
పిఠాపురం సమీక్షలో పవన్ ఏం చెప్పారంటే ?
X

పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. ఆయన 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అది కూడా బంపర్ మెజారిటీతో. దాంతో పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ పట్టుదలగా పనిచేస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పిఠాపురం మీద ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృధి విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక తాజాగా పిఠాపురం నియోజక వర్గం అభివృద్ధి పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే అగ్ర భాగాన :

పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. అందుకోసం ప్రజల అవసరాలు వారి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించడం విశేషం.

వేగంగా ప్రగతి పనులు :

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు రోగులకు అందుతున్న సేవలు 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పురోగతి తదితర అంశాలను పవన్ సమీక్షించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పిఠాపురంలోని ప్రధాన ఆలయాల్లో దేవాదాయ శాఖ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, స్థల సేకరణ, ఆలయ కమిటీల ఏర్పాటు తదితర అంశాల్లో ఉన్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో కారణంగా నీటి లభ్యత ఆధారంగా రైతులకు నీటి విడుదల క్యాలెండర్ రూపొందించి అందించాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యాక్షన్ ప్లాన్ తో :

మరో వైపు చూస్తే పిఠాపురంలో అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించాలని పవన్ అధికారులను ఆదేశించడం విశేషం. నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యత, నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ పనులని కూడా ఆయన సమీక్షించారు. పిఠాపురంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏకంగా 288 సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి కొత్తగా నిర్మించిన రోడ్ల నాణ్యతను పరిశీలించాలనిఆదేశించారు. తాను త్వరలో చేపట్టబోయే పిఠాపురం పర్యటనలో మరిన్ని పధకాలకు శ్రీకారం చుట్టాలని పవన్ ఆదేశించారు. మొత్తం మీద పవన్ పిఠాపురం ప్రగతి మీద పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడమే కాకుండా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే దేశంలో నంబర్ వన్ గా పిఠాపురం ఉండాలని ఆయన కోరుతున్నారు.