పవన్ ఫోటో ఎందుకు పెట్టకూడదూ...హైకోర్టు సూటి ప్రశ్న !
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం అని ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలు అయింది
By: Satya P | 10 Sept 2025 5:43 PM ISTరాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం అని ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలు అయింది. దాని మీద విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించినట్లుగా సమాచారం. డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టకూడని ఎక్కడన్నా నిషేధం ఉందా అని కూడా అడిగింది.
ప్రజలకు పనికి వచ్చే పిల్స్ :
ప్రజలకు ఉపయోగకరమైన పిల్స్ ని వేయాలని ఈ సందర్భంగా కోర్టు సూచించినట్లుగా సమాచారం. అంతే కాని రాజకీయ ప్రయోజనాలతో పిల్స్ వేయవద్దు అని పేర్కొంటూ పిల్ ని కొట్టి వేసింది. ఇందులో ప్రజలకు పనికి వచ్చేది ఏదీ లేదని కోర్టు తేల్చేసింది. పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ప్రకారం మంత్రిగానే ఉన్నారు అని ఆయన ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా ఉంచుతారు అని పేర్కొంటూ ఒక పిల్ ని విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఒకరు దాఖలు చేశారు. ఆయన అందులో రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు కాబట్టి ముఖ్యమంత్రి సమానంగా ఫోటోలు పెట్టడం మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు.
ఫోటోలు పెట్టడం మీద సవాల్ :
పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ప్రకారం మంత్రిగానే ఉన్నారు అని ఆయన ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా ఉంచుతారు అని పేర్కొంటూ ఒక పిల్ ని విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఒకరు దాఖలు చేశారు. ఆయన అందులో రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు కాబట్టి ముఖ్యమంత్రి సమానంగా ఫోటోలు పెట్టడం మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్తర్వులు ఏమైనా ప్రభుత్వం దీని మీద ఇచ్చిందా అని ఆయన ఆర్టీఐ చట్టం ప్రకారం వాకబు చేసి ఈ పిల్ ని దాఖలు చేశారు. అయితే ఫోటోలు పెట్టకూడదు అన్న నిషేధం అయితే లేదు కదా అన్న కోర్టు వ్యాఖ్యలతో ఈ పిల్ కొట్టివేయబడింది. మొత్తానికి ఉత్కంఠ రేపిన ఈ పిల్ విషయంలో చివరికి పవన్ కి అనుకూలంగానే రావడంతో ఆయన అభిమానులు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పవన్ ఫోటోలు ఆఫీసులలో పెట్టవచ్చా ఎలా కుదురుతుంది అని ఇంతకాలం న్యాయ రాజ్యంగ మీమాంశ పడిన వారికి కూడా ఈ తీర్పు ద్వారా ఒక సమాధానం వచ్చినట్లు అయింది అని అంటున్నారు.
