పవన్ కళ్యాణ్ కి ఏదీ ఉట్టినే రాదు !
ఈ డైలాగ్ ఇపుడు పాపులర్ అయింది. వైరల్ కూడా అయింది. ఇది ఏ రచయితా స్క్రిప్ట్ లో రాయలేదు.
By: Satya P | 22 Sept 2025 12:28 PM ISTఈ డైలాగ్ ఇపుడు పాపులర్ అయింది. వైరల్ కూడా అయింది. ఇది ఏ రచయితా స్క్రిప్ట్ లో రాయలేదు. కానీ ట్రెండ్ అవుతోంది. కారణం ఈ డైలాగ్ చెప్పింది పవర్ స్టార్. ఆయన చాలా సహజంగా చెప్పారు. క్యాజువల్ గా చెప్పారు. ఒకింత బాధ ఆవేదంతో మిక్స్ చేసి మరీ చెప్పారు. తన ఫ్యాన్స్ ని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో చెప్పారు. కానీ ఇపుడు ఈ డైలాగే సూపర్ పాపులర్ అయింది. అవుని ఇంతకీ ఇది కేవలం ఒక డైలాగ్ మాత్రమేనా. దీని వెనకాల ఏమీ లేదా. పవన్ కి ఏదీ ఉట్టినే రాదు.. మరి పవన్ నోటి వెంట కూడా ఈ తరహా డైలాగ్ ఊరకే రాదు కదా. మ్యాటరేంటి.
ఓజీ వేడుకల వేళ :
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేళ హైదరాబాద్ లో జరిగిన అభిమాన జన సందోహం మధ్య భారీ వర్షం నడుమ తాను తడుస్తూ అభిమానుల ప్రేమతో నిండా తడుస్తూ చెప్పిన డైలాగ్ ఇది. ఓజీ సినిమా ట్రైలర్ రాలేదా అని వేదిక మీద నుంచే డైరెక్టర్ సుజిత్ ని పిలిచి అడిగిన పవన్ ఆ తరువాత మైక్ అందుకుని చెప్పిన డైలాగ్ ఇది. పవన్ కి ఏదీ ఉట్టినే రాదు. ఎన్ని కష్టాలు అయినా పడాలన్నట్లుగా ఆయన ఒకింత వేదాంతం మిక్స్ చేసి మరీ చెప్పినట్లుగా ఉంది.
సాధించుకున్నదేనా :
పవన్ వెండి తెర జీవితం పూలపానుపు అనుకుంటారు. కేరాఫ్ చిరంజీవి అన్నట్లుగా సినీ తెరకు పరిచయం అయిన పవన్ తనకంటూ సొంత స్టైల్ ని సొంత అభిమాన జనాన్ని సృష్టించుకున్నారు. తానుగానే ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. చేసినవి గట్టిగా ముప్పయి సినిమాలు కూడా లేకపోయినా ఆయన ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆలిండియా లెవెల్ లో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అన్నది నిజం. ఆ విధంగా చూసుకుంటే పవన్ సినీ హీరోగా సాధించిన ఇమేజ్ గ్లామర్ అంతా ఆయన కష్టపడి తెచ్చుకున్నదే అని ఒప్పుకోక తప్పదని అంటారు.
రాజకీయాల్లోనూ :
ఇక రాజకీయ రంగంలో చూస్తే అక్కడ గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. అయినా కూడా సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి మూడు ఎన్నికలు చూసి పార్టీని ఓటమి నుంచి గెలుపు దిశగా నడిపించి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకా చేరుకున్నారు. దాని కంటే ముందు 2019లో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఇది నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడికి ఎక్కడా జరగలేదు. కానీ అయిదేళ్ళు తిరగకుండానే అద్భుతమైన మెజారిటీని సాధించి దేశంలోనే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేనకు నిలిపారు.
సత్తా ఉందని చెప్పడమేనా :
పవన్ ఎందుకు ఈ డైలాగ్ కొట్టారో కానీ తనకు సత్తా ఉందని తాను కష్టపడి సాధించుకున్నదే ప్రతీ ఒక్కటీ అని చెప్పడానికే అన్నారా అని విశ్లేషించుకుంటున్నారు. రాజకీయాల్లో పవన్ పొత్తులతోనే గెలిచారు కానీ సొంతంగా గెలవలేరు అన్న వారికి కూడా ఈ డైలాగ్ ఒక షాక్ లాగానే ఉంటుంది అని అంటున్నారు. నిజానికి చూస్తే 2024లో పవన్ సొంతంగా పోటీ చేసినా ఆ 21 సీట్లు సాధించేటంత పొలిటికల్ ఇమేజ్ ని తెచ్చుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఓట్లు చీలి ఏపీలో వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని భావించే ఆయన పొత్తుల వైపు మొగ్గు చూపారు అన్ అంటారు. మొత్తం మీద పవన్ లక్ష్యం అధికారం కాదని మంచి ప్రహ్బుత్వం అని చాటి చెప్పేందుకే పొత్తులు అని అంటారు. ఇక పవన్ అందుకున్న ఏ హోదా అయినా ఉట్టినే రాదు అని ఆయన ఎంతో కష్టం పెట్టారు అన్నదే తాజా డైలాగ్ వెనక సారాంశం అని కూడా అంటున్నారు.
