Begin typing your search above and press return to search.

పవన్ పక్కా వ్యూహం...అందుకే డేరింగ్ స్టెప్ !

అయితే ఇపుడు జనసేన అధికారంలో భాగంగా ఉంది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

By:  Satya P   |   29 May 2026 1:51 AM IST
పవన్ పక్కా వ్యూహం...అందుకే డేరింగ్ స్టెప్ !
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల గురించి అవగాహన పెద్దగా లేదని అనుకునే వారు అంతా పప్పులో కాలేసినట్లే. ఆయన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన సరైన దిశగానే అడుగులు వేస్తున్నారు అని అర్ధం అవుతుంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కట్టించి తన పార్టీకి 21 సీట్లు తెచ్చుకుని గెలిపించుకుని కూటమిలో రెండవ బలమైన పార్టీగా మార్చుకుని ఉప ముఖ్యమంత్రి పదవి దాకా పవన్ ఎదగడం అన్నది ఒక అద్భుతమైన వ్యూహరచన అని అంటున్నారు. ఇదంతా పవన్ తన పొలిటికల్ చరిష్మాని సినీ గ్లామర్ ని సామాజిక వర్గం బలాన్ని కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాడుకుని సాధించిన విజయాలుగానే విశ్లేషిస్తారు.

అక్కడే కూరుకుని పోయి :

అయితే ఇపుడు జనసేన అధికారంలో భాగంగా ఉంది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఇంకా రొటీన్ వ్యూహాలనే అనుసరిస్తే ఇబ్బంది పడడమే కాదు జనసేనకు కుల ముద్ర పడుతుంది అని ఎప్పటికీ అదే చోట అక్కడే కూరుకుని పోతామని కూడా ఒక ఆలోచన ఉంది. అందుకే ఇపుడు పవన్ తాజాగా చేసిన ప్రకటనలను చూడాలని అంటున్నారు. పవన్ కాపు కులాన్ని ఏమీ నిందించలేదు, ఆ కులంలో నుంచి కొందరు నాయకులు చేస్తున్న అతి గురించే ఆయన మాట్లాడారు, వారి మీదనే పరోక్షంగా విమర్శలు చేశారు. ఇంతకీ పవన్ అన్న మాటలను ఒక్కసారి గమనిస్తే ఆయన చాలా వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన ఇచ్చారు అని అంటున్నారు.

కులం ముద్రతో సాధ్యం కాదు :

ఏపీలో టీడీపీ ఉంది, దానికి ఎవరూ కమ్మ పార్టీ అని అనలేరు. అందులో అందరూ ఉన్నారు, పైగా అన్ని గొంతుకలూ వినిపిస్తాయి. అలాగే వైసీపీని రెడ్ల పార్టీ అనలేరు. అందులో కూడా అనేక కులాల నుంచి ఫోకస్ అయ్యేవారు ఉన్నారు జనసేనను కూడా ఆ విధంగా మార్చలనే పవన్ చూస్తున్నారు అని అంటున్నారు అందుకే ఆయన ఇతర సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు ఇస్తున్నారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఏపీలోనే కాదు ఎక్కడైనా అధికారం దక్కాలీ అంటే ఒక కులం అండతో సాధ్యపడదని చరిత్ర నిరూపిస్తోంది. దాని కంటే ముందు కుల ముద్ర పడితే అది మరింత ప్రమాదం కూడా అని చెబుతున్నారు. అందుకే పవన్ తాను సమాజం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని స్పష్టంగా చెప్పారు అని అంటున్నారు. ఈ విధంగా అందరి వాడుగా ఉండడం వల్లనే జనసేన అనుకున్న లక్ష్యాలను సాధించగలదని పవన్ బలంగా నమ్ముతున్నారు.

ఆ ఓటు బ్యాంక్ అలాగే :

ఇక పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కొందరు నాయకులు అయితే బాధపడవచ్చు విభేదించవచ్చు కానీ పవన్ ని మొదటి నుంచి అభిమానించే వారు కానీ అలాగే ఆయన సినీ ఇమేజ్ తో సాధించుకున్న అభిమాన గణం కానీ జనసేన పార్టీ పెట్టాక వచ్చిన అన్ని వర్గాల మద్దతు కానీ చెక్కు చెదరదు అని అంటున్నారు. అంతే కాదు కొంతమంది నాయకులు విభేదించినంత మాత్రాన కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కి ఆదరణ తగ్గేది లేదని అంటున్నారు. అయితే మాంసం తిన్నామని ఎముకలు మెడలో ఎవరూ వేసుకోరు, రాజకీయాల్లో కూడా అలాగే ఉండాలని అంటున్నారు. కులం ముద్ర బాహాటంగా పడితే అది అసలుకే ఎసరు తెస్తుందని భావించే ఇన్నాళ్ళుగా భరిస్తూ వస్తున్న పవన్ ఇపుడు డేరింగ్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.

గేర్ మారుస్తారా :

ఇక 2029 ఎన్నికల మీద కూడా జనసేనానికి ఒక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల నుంచే పార్టీని పటిష్టం చేసుకుని ఎక్కువగా తమ వారిని గెలిపించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఎక్కువ సీట్లు కోరవచ్చు అని అలా జనసేన బలంగా ఉన్న చోట్ల పోటీ చేసి 2029 ఎన్నికల తరువాత తాము కీలకమైన స్థానంలో ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కరెక్ట్ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు.