Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ లో ఈ బిగ్ ఛేంజ్ గమనించారా..?

అయితే దుస్తుల్లో ఈ మార్పు అభిమానుల నుండి పదేపదే వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనా.. లేక, తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

By:  Raja Ch   |   23 Oct 2025 3:31 PM IST
పవన్ కల్యాణ్ లో ఈ బిగ్ ఛేంజ్ గమనించారా..?
X

అటు సినిమాల్లో అయినా, ఇటు నిజ జీవితంలో అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైలే వేరనే సంగతి తెలిసిందే. అందుకే స్టైల్ విషయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారని అంటారు. ఈ క్రమంలో.. గతంలో ఏ ఫంక్షన్ లో కనిపించినా పవన్ కల్యాణ్ స్టైలిష్ గా కనిపించేవారు. అయితే.. రాజకీయ క్షేత్రంలోకి వ‌చ్చాక జనసేనాని వైట్ అండ్ వైట్‌ కుర్తా దుస్తుల్లోనే క‌నిపిస్తూ ఉన్నారు.

కొన్ని సందర్భాల్లో కాషాయ పంచె, షర్టుతో కనిపించే పవన్.. రెగ్యులర్ గా వైట్ అండ్ వైట్ కుర్తా లోనే కనిపిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది జూన్ మొదటివారంలో విజయవాడలో ఒక సెలూన్ ఓపెనింగ్ కి హాజరైన సమయంలో మాత్రం స్కై బ్లూ క‌ల‌ర్ టీ షర్ట్, బ్లాక్ షార్ట్, షూస్, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌ తో క‌నిపించారు. ఇదే క్రమంలో పాత లుక్ ఫార్మల్స్ తో కంటిన్యూ చేస్తున్నారు!

అవును... రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి.. ప్రధానంగా అధికారంలోకి వచ్చి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ పవన్ కల్యాణ్ వైట్ అండ్ వైట్ కుర్తాలోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయాల దర్శనాలకు వెళ్లినపుడు మాత్రం మరో లుక్ లో కనిపిస్తున్నారు. అయితే గత రెండు వారాలుగా పవన్ కాస్త కలర్ ఫుల్ షర్ట్స్, ప్యాంటులను ధరిస్తున్నారు.

అయితే దుస్తుల్లో ఈ మార్పు అభిమానుల నుండి పదేపదే వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనా.. లేక, తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రధానంగా బ్లాక్ పాంట్, వైట్ షర్ట్.. డార్క్ బ్లూ కలర్ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్.. స్కై బ్లూ కలర్ షర్ట్, క్రీం కలర్ ప్యాంట్ వంటి కాంబినేషన్స్ లో ఇటీవల పవన్ సరికొత్తగా కనిపిస్తున్నారు.

కాగా.. సాధారణంగా ప్రధాన రాజకీయ నాయకులందరూ ఒకే రకమైన ప్రామాణిక దుస్తుల్లో స్థిరపడటం చాలా సాధారణమనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు ఎల్లప్పుడూ ఖాకీ చొక్కా, ప్యాంటు ధరిస్తారు. మరోవైపు, ఏపీ మాజీ సీఎం జగన్ తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంటు ధరిస్తారు. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఎక్కువగా బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ లో కనిపించేవారు!

ఇక సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎక్కువగా వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ ధరిస్తుంటారు. మరికొంతమంది ప్యాంటులు మార్చినా, షర్ట్స్ విషయంలో మాత్రం వైట్ కలర్ కే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. పలువురు టీడీపీ నేతలు అప్పుడప్పుడూ పసుపు రంగు షర్ట్స్ ధరిస్తూ కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే!