Begin typing your search above and press return to search.

ప్రొఫెసర్ అరెస్టు...పవన్ కామెంట్స్ వైరల్ !

ఆయన అంటే తనకు ఇష్టం ఉందని అన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్తున్నారు అని వార్తలు విన్నాను అని పవన్ చెప్పారు.

By:  Satya P   |   26 May 2026 11:59 PM IST
ప్రొఫెసర్ అరెస్టు...పవన్ కామెంట్స్ వైరల్ !
X

మేధావి రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు విషయంలో పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనను అరెస్టు చేస్తారు అని వార్తలు తెలిసినపుడు వద్దు అని చెప్పాను అని పార్టీ సమావేశంలో చెప్పారు. ఆయన పొరపాటునో మరో విధంగానో అని ఉండొచ్చు అని వదిలేయమని అన్నాను అని చెప్పారు. రాజమండ్రిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఆయనను అరెస్టు చేయడం ఎందుకు అని సంచలన కామెంట్స్ చేశారు. విశ్లేషకుడుగా ఆయన భావోద్వేగంతో ఏదైనా మాట్లాడి ఉండవచ్చు అని పవన్ అన్నారు.

ఆయనంటే ఇష్టం :

ఆయన అంటే తనకు ఇష్టం ఉందని అన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్తున్నారు అని వార్తలు విన్నాను అని పవన్ చెప్పారు. అలాంటివి అసలు చేయవద్దు అని పోలీసులకు సూచించాను అని ఆయన అన్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టవద్దు అని తాను చెప్పాను అని అన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన చెప్పాను అన్నారు కొంతమంది విశ్లేషణలకు అర్ధం పర్ధం లేకుండా పోతోంది అని పవన్ చెప్పారు. వారి ఎదగడానికో లేక గుర్తింపు పొందడానికో విశ్లేషకులు కొంతమంది ఇలా చేస్తున్నారేమో అని ఆయన అన్నారు. . తనను తిట్టిన వారి ఇళ్ళలో పెళ్ళికి వెళ్ళిన సంస్కారం తనది అని పవన్ అన్నారు.వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె పెళ్ళికి తాను వెళ్ళాను అని గుర్తు చేసుకున్నారు. పబ్లిక్ ఫంక్షన్ల విషయంలో ఒక కర్టెసీ ఉంటుందని సంస్కారంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.

ముగిసిన అధ్యాయం :

మరో వైపు తెలంగాణా డీజీపీని కలిసిన అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు అన్నవి ఒక ముగిసిన అధ్యాయంగా చెప్పారు. ఆ వివాదం కూడా ముగిసిపోయింది అని అంటూ జనసేన వారు కూడా అదే చెప్పారు అని అన్నారు మళ్ళీ దానిని తెరవడం అవసరమా అని మీడియాను ప్రశ్నించారు. ఇక తనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రాలేదని తనకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం విశేషం.

ఎండ్ కార్డు పడినట్లేనా :

మొత్తం మీద చూస్తే ప్రొఫెసర్ వర్సెస్ జనసేనల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం కానీ లేదా వివాదం కానీ ముగిసినట్లే అని అంటున్నారు. ప్రొఫెసర్ అంటే తనకు ఇష్టం అన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించడం అలాగే తాను మొత్తం వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అని ప్రొఫెసర్ చెప్పడమూ జరిగిపోయాయి. దాంతో అరెస్టు అన్న వార్తలు కూడా నిజం కావని తేలిపోయింది అని అంటున్నారు. అలా గత కొన్ని రోజులుగా సాగుతున్న వివాదం అయితే క్లోజ్ అయినట్లే అంటున్నారు. యుద్ధాన్ని నేను ముగిస్తాను అని ప్రొఫెసర్ ఒక దశలో సీరియస్ గా చెప్పిన మాటలకు సైతం ఇపుడు ముగింపు పలికినట్లే అని అంటున్నారు.