Begin typing your search above and press return to search.

కేర‌ళ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పార్టీ ఏం చెప్పిందంటే!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కేర‌ళ‌కు వెళ్ల‌నున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న అక్క‌డే ఉండనున్నారు.

By:  Garuda Media   |   21 Aug 2026 10:36 PM IST
కేర‌ళ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పార్టీ ఏం చెప్పిందంటే!
X

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కేర‌ళ‌కు వెళ్ల‌నున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న అక్క‌డే ఉండనున్నారు. ఈ మేర‌కు పార్టీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేర‌ళ‌లో ప్ర‌కృతి వైద్యం స‌హా.. ఆయుర్వేద వైద్యాన్ని ప‌వ‌న్ తీసుకుంటార‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కేర‌ళ‌కు వెళ్తున్న ట్టు పార్టీ పేర్కొంది. గ‌త కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో ఆయ‌న‌కు మ‌హారాష్ట్రలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు.

అనంత‌రం.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉండ‌గా.. కేవ‌లం రెండు రోజుల త‌ర్వాత‌.. తిరిగి విధుల్లో చేరిపోయా రు. ఇటీవ‌ల ఆయ‌న చేతికి ఉన్న క‌ట్టు కూడా విప్పేశారు. అయితే.. ఆ త‌ర్వాత రెండు రోజులు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అనూహ్యంగా ఆయ‌న తీవ్ర జ్వ‌రం బారిన ప‌డ్డారు. త‌ర్వాత హైద‌రాబాద్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో వైద్యులు ఇచ్చిన సూచ‌న‌ల మేరకు కేర‌ళ‌లో ప్ర‌కృతి వైద్యంతో పాటు ఆయుర్వేద వైద్యాన్ని పొందేందుకు శ‌నివారం కేర‌ళ‌కు వెళ్తున్నారు.

కేర‌ళ నెంబ‌ర్ 1

ప్ర‌కృతి వైద్యంలో కేర‌ళ నెంబ‌ర్ 1గా నిలిచింది. మ‌న దేశంలోని వివిధ రాష్ట్రాల‌కుచెందిన వారే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు. ప్ర‌కృతి, ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతులైన వైద్యులు ఇక్క‌డ ఉన్నారు. స‌మ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ.. రోగుల్లో స్వ‌స్థ‌త చేకూరుతుందన్న న‌మ్మ‌కం ప్ర‌గాఢంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా కేర‌ళ‌కు వెళ్లాల‌ని వైద్యులు సూచించారు. కాగా.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అయ్యే ఖ‌ర్చును వ్య‌క్తిగ‌త నిధుల నుంచి వినియోగించుకోనున్నార‌ని పార్టీ కార్యాల‌యం పేర్కొంది.