Begin typing your search above and press return to search.

పవన్ సుదీర్ఘ కసరత్తు... వారి కోసమేనట ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ కసరత్తు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన తీరులో ఈ విధంగా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఎవరి కోసం అంటే వారి కోసమే అని అంటున్నారు.

By:  Satya P   |   18 Aug 2026 8:00 AM IST
పవన్ సుదీర్ఘ కసరత్తు... వారి కోసమేనట ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ కసరత్తు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన తీరులో ఈ విధంగా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఎవరి కోసం అంటే వారి కోసమే అని అంటున్నారు. అంతే కాదు జనసేనను పది కాలాల పాటు అత్యంత పటిష్టంగా ఉంచాలన్న తపన తాపత్రయం కోసం అని చెబుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే జనసేన సంస్థాగత కమిటీల విషయంలో పవన్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. నిజానికి ఆగస్టు 14 నాటికి కమిటీలు రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ దాకా ప్రకటించాలని అనుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ కమిటీ పదవులు అందుకున్న వారు అంతా జెండా వందనం ఎక్కడికక్కడ చేయాలని కూడా రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లనే ఆలస్యం జరుగుతోంది అని అంటున్నారు.

అర్హతలు అవేనట :

ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతూ కట్టుబడి ఉంటారో ఎవరైతే నిజాయతీతో నిబద్ధతతో నాదీ పార్టీ అని నమ్మి పనిచేస్తారో ఎవరైతే జనసేన జెండాను భుజాన వేసుకుని పార్టీని మరింతగా బలోపేతం చేస్తారో వివాదాలకు దూరంగా జనాలకు దగ్గరగా ఉంటారో వారికే ఈ పదవులు అని అధినాయకత్వం గట్టిగా తీర్మానించుకుంది అని అంటున్నారు. జనసేనకు అలాంటి వారు వందలూ వేలల్లో ఉన్నారు. వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించడమే ఇపుడు ఒక సవాల్ అని అంటున్నారు. అందుకే ఈ జాప్యం అని కూడా అంటున్నారు.

లేట్ అయినా ఓకే :

ఈ విషయంలో పవన్ పట్టుదల ఏ తీరున ఉంది అంటే కాస్తా లేటు అయినా ఫరవాలేదు, రైట్ పర్సన్ కి పదవులు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా పార్టీ జెండాతో జనం ముందుకు దూసుకుని పోయే నాయకత్వం కోసం ఆయన చూస్తున్నారు. వారికే మెడలో వరమాల వేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ పవన్ కి ఉన్న కమిట్మెంట్ ని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండా తానే స్వయంగా కమిటీల కూర్పు విషయంలో పవన్ శ్రమిస్తున్నారు అని అంటున్నారు. ఒకటికి పదిసార్లు అన్నీ సరి చూసుకుంటూ అవసరం అయిన ఫీడ్ బ్యాక్ ని తెప్పించుకుంటూ మరీ ఆయన కమిటీల నియామకం విషయంలో ఒక రకమైన యజ్ఞమే చేస్తున్నారు అని అంటున్నారు.

ఎక్కడా మాట రాకుండా :

ఫలానా వారికి పదవి ఎందుకు ఇచ్చారు అని ఎవరూ వేలెత్తి చూపకుండా పదుగురూ మెచ్చేలా ఉండేలా పవన్ కట్టుదిట్టంగా ఈ ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎవరు, జిల్లాల బాధ్యులు ఎవరు, నియోజకవర్గాల ఇంచార్జిలు ఎవరు మండల గ్రామ స్థాయి నాయకులు ఎవరు ఇలా బూత్ లెవెల్ దాకా పార్టీకి ఒక పటిష్టమైన నేతలను అందించాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. తొందరలోనే మళ్ళీ ఈ కసరత్తులో పాలు పంచుకుంటారని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి జనసేనకు సంస్థాగతంగా కొత్త రూపు షేపూ తీసుకుని వస్తారని అంటున్నారు. మొత్తం మీద పవన్ పట్టుదల చూస్తూంటే జనసేన కమిటీలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న ఆసక్తి అయితే సొంత పార్టీలోనే కాదు మొత్తం రాజకీయ వర్గాలలోనూ కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ ప్రకటన ఎపుడు ఎలాగ వస్తుందో.