Begin typing your search above and press return to search.

పవన్ వస్తున్నారు...సీట్ల పంచాయతీ తేల్చుడేనా ?

అంతే కాదు అసెంబ్లీ ఫార్ములా వర్తించదు అని కూడా స్పష్టం చేసింది. అంటే అప్పట్లో 21 సీట్లు ఇచ్చారు కానీ ఈసారి 30 శాతం సీట్లు తమ పార్టీకి కేటాయించాలని గట్టిగా కోరుతోంది.

By:  Satya P   |   6 Sept 2026 9:51 AM IST
పవన్ వస్తున్నారు...సీట్ల పంచాయతీ తేల్చుడేనా ?
X

ప్రకృతి వైద్యం కోసం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెల చివరి వారంలో కేరళం వెళ్లారు. అక్కడ ఆయన తన కుడి భుజానికి జరిగిన ఆపరేషన్ తలెత్తిన సమస్యలను ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు అని చెప్పారు. ఇరవై రోజుల పాటు పవన్ అక్కడే ఉంటారు అని కూడా పార్టీ పేర్కొంది. మొత్తానికి పవన్ కేరళం వైద్యం విషయం పూర్తి చేసుకుని ఈ నెల 10 నాటికి ఏపీకి వస్తారు అని అంటున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల సందడి అయితే మొదలైపోయిన నేపథ్యంలో కూటమి పార్టీల మద్య కీలకమైన సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలాల్సి ఉంది. జనసేన అయితే ఎక్కువ సీట్లు ఈసారి ఆశిస్తోంది. అంతే కాదు అసెంబ్లీ ఫార్ములా వర్తించదు అని కూడా స్పష్టం చేసింది. అంటే అప్పట్లో 21 సీట్లు ఇచ్చారు కానీ ఈసారి 30 శాతం సీట్లు తమ పార్టీకి కేటాయించాలని గట్టిగా కోరుతోంది.

మేయర్లు, జెడ్పీ చైర్మన్లు :

ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో వీటిలో కచ్చితంగా ప్రతీ చోటా 30 శాతం సీట్లు తీసుకోవాలని జనసేన నిర్ణయించింది అని అంటున్నారు. మేయర్ సీట్లు కనీసంగా అయిదు నుంచి ఆరు దాకా అలాగే జెడ్పీ చైర్మన్లు 9 దాకా, మున్సిపల్ చైర్మన్లు 25 దాకా తీసుకోవాలన్నది జనసేనలో వినిపిస్తున్న మాట. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ముప్పయి శాతం ఫార్ములాతో తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. జనసేన నుంచి ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. కూటమి పార్టీలతో పొత్తుల వల్ల వారికి ఇచ్చిన సీట్లు గెలుస్తారు అని అలా పార్టీలో గత పుష్కర కాలంగా పనిచేస్తున్న సైనికులకు న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నారు.

కీలక భేటీ ఉంటుందా :

మరో వైపు చూస్తే ఏపీలో కూటమి పార్టీల అధినేతల మధ్య కీలక భేటీ ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే ఎన్డీయే సమావేశం జరిగింది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఇక జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ లతో జరిగిన ఈ సమావేశంలో కూటమి ఐక్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భేటీయే అత్యంత కీలకం అని చెబుతున్నారు. ఈ భేటీ తరువాతనే సీట్ల సర్దుబాటు మీద అసలైన పిక్చర్ వస్తుందని అంటున్నారు. జనసేనలో ఇప్పటికే ఆశావహుల గురించిన సమాచారంతో పాటు పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బలాబలాలు గురించిన సమాచారం కూడా నివేదిక రూపంలో ఉంది. దానిని పార్టీ అధ్యక్షుడు పవన్ కి 14 మంది సభ్యులతో నియమించిన విధాయకమండలి సమర్పిస్తుందని అంటున్నారు. ఆ మీదట పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద కూటమిలో చర్చిస్తారు అని అంటున్నారు.

సామరస్యంగానే :

జనసేన కూటమి ఐక్యతకు ఇబ్బంది రాకుండా సామరస్యంగానే సీట్ల సర్దుబాటు విషయంలో వ్యవహరించాలని చూస్తోంది అని అంటున్నారు. పార్టీ నేతలకు అన్యాయం జరగకుండా వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుంటారని అదే సమయంలో జనసేన కోరిన సీట్ల విషయంలో కూడా దక్కాల్సిన వాటిని తీసుకుంటారని అంటున్నారు. మొత్తం మీద ఈ నెల మూడవ వారంలో ఎన్డీయే కీలక భేటీ ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.