పవన్ కాకినాడ మీటింగ్...డిసైడ్ చేస్తారా ?
జనసేన స్థానిక సంస్థల ఎన్నికల వేళ అత్యంత కీలకమైన సమావేశాన్ని కాకినాడలో ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
By: Satya P | 20 Sept 2026 10:10 PM ISTజనసేన స్థానిక సంస్థల ఎన్నికల వేళ అత్యంత కీలకమైన సమావేశాన్ని కాకినాడలో ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కీలక నేతలు హాజరవుతారని చెబుతున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికలలో ఎలాంటి విధానం అవలంబించాలి ఎన్నికలకు ఎలా ప్రిపేర్ కావాలి అన్న దాని మీద చర్చిస్తారు అని అంటున్నారు.
తొలిసారిగా మీట్ :
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల వేడి రాజుకున్నాక తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇంతటి ముఖ్య సమావేశం జరుగుతోంది. అది కూడా కాకినాడలో జరుపుతున్నారు. దాంతో ఈ సమావేశంలో ఏమేమి అంశాలు చర్చకు వస్తాయి అన్న దాని మీద అంతా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జనసేన అయితే ఈసారి ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేయాలని చూస్తోంది. 2024 నాటి పాత ఫార్ములాను పక్కన పెట్టేసి 30 శాతం సీట్లు తగ్గకుండా పొత్తులలో భాగంగా కోరాలని చూస్తోంది అన్నది ప్రచారంలోకి వచ్చింది. దాని మీద ఈ కీలక మీట్ లో ఏమైనా డిసైడ్ చేస్తారా అన్నది కూడా డిస్కషన్ చేస్తున్నారు.
చాలా కాలానికి :
పవన్ కళ్యాణ్ గత నెల 23న కేరళం వెళ్ళి అక్కడే చాలా రోజుల పాటు ప్రకృతి వైద్యం చేయించుకున్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత తొలి మీటింగ్ ఇది కావడంతో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇక ఈ మీటింగ్ లో పవన్ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. జనసేనకు సంబంధించి చూస్తే 21 అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేలు ఉన్నారు. దానితో పాటు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రాలో బలం పెరిగింది అని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లాలో జనసేన పలుకుబడి అధికం అయింది అని అంటున్నారు. దాంతో నియోజకవర్గాల స్థాయిలో కూడా జనసేన బలాబలాల గురించి చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇక సీట్ల విషయం మీద ఇప్పటికే జనసేనలో అగ్ర నేత అయిన నాదెండ్ల మనోహర్ అయితే సర్దుకుని పోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. దాని మీద జనసేనలో చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో పవన్ సీట్ల విషయంలో ఏమి చెబుతారు అని జనసైనికులు చూస్తున్నారు.
ఎన్డీయే మీట్ సైతం :
ఇక ఈ సమావేశం తరువాత ఎన్డీయే నేతల మీట్ ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు పవన్ సీట్ల సర్దుబాటు విషయంలో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక జనసేన నియమించిన కమిటీ కూడా గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి జనసేన బలాబలాల గురించి సమగ్రమైన వివరాలతో నివేదికను తయారు చేసింది అని అంటున్నారు. ఈ నివేదిక కూడా అధినాయకత్వానికి అందిస్తారు అని అంటున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీయే సమావేశంలో పవన్ మాట్లాడేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద జనసేనలో ఎవరు ఏమి మాట్లాడారు అన్నది ముఖ్యం కాదని సీట్ల గురించి ఎన్నికల గురించి పవన్ చెప్పే మాటే ఫైనల్ అని అంటున్నారు. దాంతో పవన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం మీద అందరి కళ్ళూ ఉన్నాయి. చూడాలి మరి ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాల మీద డిసైడ్ చేస్తారో.
