Begin typing your search above and press return to search.

జగన్ సౌండ్ కి పవన్ రీ సౌండ్

వైసీపీ అధినేత చేసిన బిగ్ సౌండ్ కి జనసేన అధినేత పవన్ ఆ వైపు నుంచి రీ సౌండ్ చేశారు.

By:  Satya P   |   28 Oct 2026 12:00 AM IST
జగన్ సౌండ్ కి పవన్ రీ సౌండ్
X

వైసీపీ అధినేత చేసిన బిగ్ సౌండ్ కి జనసేన అధినేత పవన్ ఆ వైపు నుంచి రీ సౌండ్ చేశారు. జగన్ 2.0 అంటే కూటమి 10.0 అని ధీటుగా బదులిస్తుందని పవన్ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ 1.0 అన్నపుడే కూటమి అంతా కలసి 2024 ఎన్నికల్లో ఓడించింది అని గుర్తు చేశారు. అందువల్ల జగన్ 2.0 అన్నది కూటమి దగ్గర ఏ మాత్రం సౌండ్ చేయదని తేల్చేశారు. జగన్ చాలా కాలంగా చెప్పుకుని వస్తున్న 2.0 ని జనసేన అధినేత అలా 10.0 అంటూ బిగ్ పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చి డిస్కషన్ లోకి పెట్టారని అంటున్నారు.

బలహీనులు మాత్రమే :

బలవంతులు ఎవరూ బెదిరించరు అని కూడా పవన్ అన్నారు. బెదిరించేది బలహీనులు మాత్రమే అని జగన్ కి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సామాన్యులకు రక్షణ కవచంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష వైసీపీ ఎలాంటి సౌండ్స్ చేసినా తగ్గేది లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఒక విధంగా జగన్ చేసిన ఈ బిగ్ సౌండ్ కి కూటమి మొత్తానికి పవన్ జవాబు ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు.

కలసికట్టుగానే :

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రౌండ్ లెవెల్ లో పెద్ద ఎత్తున పోటీ ఉంది కాబట్టి కూటమిలో సీట్ల సర్దుబాటు అంత ఈజీ కాదని అంతా అనుకున్నారు. వైసీపీ ఆ విధంగానే అంచనా వేసింది. అంతే కాదు అసంతృప్తులు పెద్ద ఎత్తున పెరిగిపోతాయని అవి చివరికి కూటమికే విభేదాలు తెచ్చేలా సాగుతాయని కూడా భావించారు. కానీ పవన్ మాత్రం కూటమి కలసికట్టుగానే ముందుకు సాగుతుందని చంద్రబాబు పీవీఎన్ మాధవ్ లతో కూడిన ఉమ్మడి ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. తామంతా ఒక్కటే అన్నారు. రెండున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి పాలనలో సాగింది అని కూడా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు దార్శనికతను మరోసారి ఆయన జనం ముందు పెట్టారు.

వైసీపీని అడ్డుకోవడానికే :

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్నది జనసేన ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దానికోసం కూటమిలో ఐక్యత కోసం ఎందాకైనా అన్న తీరుని ఆ పార్టీ కనబరుస్తోంది. రాజకీయాలు, పొత్తులు, జనసేనలో ఆశావహుల ఆలోచనలు, ఆకాంక్షలు అన్నీ ఒక ఎత్తుగా పెట్టి వైసీపీని తిరిగి అధికారానికి రాకుండా దూరం చేయడం అన్నది జనసేన అధినాయకత్వం అతి పెద్ద రాజకీయ ప్రాధాన్యతగా ఉంది అని అంటున్నారు. అందువల్లనే కూటమిలో స్థానిక ఎన్నికల సర్దుబాట్లు లో ఏ ఇబ్బందులు వచ్చినా అంతిమంగా విభేదాలకు ఆస్కారం లేని విధంగా పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జరిగేవి 2029 సార్వత్రిక ఎన్నికలే. స్థానిక పోరులోనే సర్దుబాటు కుదిరినపుడు సార్వత్రిక ఎన్నికల్లో అది ఈజీగానే ఉంటుందని అంటున్నారు.

సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం :

పవన్ తాజా ప్రకటనలు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడినది కానీ చూస్తే కూటమిగా 2029 లో తాము అంతా వస్తామని స్పష్టంగా చెబుతున్నారు. మరోసారి అధికారానికి ఇదే అసలైన రాచబాట అని ఇంతకు మించిన రాజకీయ వ్యూహం కూడా తమకు అవసరం లేదని కూడా నిర్ధారిస్తున్నారు. మూడు పార్టీలు ఒక్కటిగా వస్తే వైసీపీకి ఓటమే అన్నది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. అది 2014, 2024 లో రెండు సార్లు రుజువు అయింది. 2019లో విడిపోవడం వల్ల వైసీపీకి ప్లస్ అయింది. మరి 2029 లో మూడు పార్టీలు కలసికట్టుగా వచ్చినా వైసీపీ గెలుస్తామని అంటోంది. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తామని అంటోంది. అది సాధ్యమా కాదా అన్నది తెలియాలి అంటే అప్పటి వరకూ వేచి చూడాల్సిందే. మొత్తం మీద చూస్తే జగన్ బిగ్ సౌండ్ చేస్తే తాను రీ సౌండ్ చేసి తీరుతాను అని పవన్ ఇచ్చిన కౌంటర్ తో జగన్ వర్సెస్ పవన్ గా 2029 ఎన్నికలు ఉండబోతాయా అన్నదే హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది.