Begin typing your search above and press return to search.

తుపాకి చేత బట్టి... పవన్ సంచలనం

తన చిన్నప్పటి జీవితం గురించి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఏఎన్ఐ పాడ్ క్యాస్టు కి కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.

By:  Satya P   |   10 Jun 2026 11:59 PM IST
తుపాకి చేత బట్టి... పవన్ సంచలనం
X

తన చిన్నప్పటి జీవితం గురించి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఏఎన్ఐ పాడ్ క్యాస్టు కి కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. తాను టీనేజ్ లో ఉన్నపుడు సమాజం పోతున్న తీరు పట్ల చాలా ఆగ్రహంగా ఉండేవాడిని అని ఆయన చెప్పారు. సమాజంలో సాగుతున్న అసమానతలు వివక్ష మీద తనలో తెలియని ఆవేశం ఉండేదని అన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ అయితే వైరల్ అవుతోంది.

నక్సలైట్ కావాలనుకున్నా :

ఇదిలా ఉంటే యుక్త వయసులో ఉన్నపుడు తనకు ఎంతో ఆవేశం ఉండేదని పవన్ చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఎంత కోపం ఉండేది అంటే ఏకంగా తుపాకీని చేత బట్టి నక్సలైట్ గా మారిపోవాలని ఉండేదని అన్నారు. దీంతో నక్సలైట్ ఉద్యమం గురించి చాలా ఏళ్ళ పాటు ఆలోచన కూడా చేశాను అని పవన్ చెప్పారు. తనలో అలా మొదటి నుంచి తిరుగుబాటు తత్వం ఉండేదని పవన్ అన్నారు.

నిర్మాణాత్మకమైన తీరు :

అయితే సమాజం మార్చేందుకు తాను ఎంచుకున్న బాట నుంచి మళ్ళించినందుకు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. తనను నిర్మాణాత్మకమైన పంధాలో నడిపించారని రాజకీయ మార్గంలోకి తెచ్చారని ఆయన అన్నారు అందుకు గానూ చిరంజీవికి తాను థాంక్స్ చెప్పాలని అన్నారు.

కోపాన్ని సరైన మార్గంలో :

కోపం ఉంది, సమాజాన్ని బాగు చేయాలని కోరిక ఉంది. దానిని సరైన మార్గంలో పెట్టడానికి కారణం రాజకీయ పంధా అని ఆయన అన్నారు. రాజకీయాల ద్వారా సమాజానికి సేవ చేయాలన్నది తన కొత్త పంధా అయింది అన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ప్రజా సేవ చేయాలన్నది తన ఆకాంక్షగా ఉందని అలా తాను చేస్తూ వచ్చాను అని కూడా చెప్పారు.

ఆ సినిమాతో తీరింది :

అయితే నక్సలైట్ అవాలన్నది తన నిజ జీవితంలో యుక్త వయసులో కోరిక అయితే అది జల్సా అనే మూవీలో తీరింది అని పవన్ అన్నారు. ఆ సినిమాలో తాను నక్సలైట్ పాత్రలో కనిపిస్తాను అని పవన్ చెప్పారు. అందులో పవన్ సంస్కరించబడిన నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అసలు పేరు అది :

ఇక పవన్ కళ్యాణ్ తన అసలు పేరుని కూడా ఈ సందర్భంగా రివీల్ చేశారు. శ్రీ కళ్యాణ్ కుమార్ అన్నది తన ఒరిజినల్ నేం అన్నారు. తన నామకరణం కూడా టీటీడీలో జరిగింది అని చెప్పారు. అయితే ఆ తరువాత స్కూల్ సర్టిఫికేట్ లో శ్రీని తీసేశారు అని ఇక తాను మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నపుడు తన పేరుకు ముందు పవన్ గా శిక్షకులు చేర్చారు అన్నారు. పవనుడు అంటే ఆంజనేయుడు అని ఆయన అర్థం చెప్పారు.