Begin typing your search above and press return to search.

హోం శాఖ మీద పవన్ మళ్లీ అదే మాట

పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలకం అన్నది కచ్చితమైన రాజకీయ విశ్లేషణ. ఇందులో రెండవ మాటకు అవకాశమే లేదు.

By:  Satya P   |   21 Jun 2026 10:11 AM IST
హోం శాఖ మీద పవన్ మళ్లీ అదే మాట
X

పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలకం అన్నది కచ్చితమైన రాజకీయ విశ్లేషణ. ఇందులో రెండవ మాటకు అవకాశమే లేదు. ఏపీ రాజకీయాలను 2024లో మార్చిన ఘనత పవన్ కే దక్కుతుంది. ఆయన ఒక తులాబారంగా ఆనాడు మారారు. 2019, 2024 ఎన్నికలను విశ్లేషించుకుంటే కనుక పవన్ పొలిటికల్ గా ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికీ అన్నది ఈజీగా అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే పవన్ కి కూటమిలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన కోరుకున్న శాఖలు అంటూ ఆరు ప్రధాన శాఖలనే ఇచ్చారు.

ప్రాధాన్యతమైనవే :

ఆయా శాఖలు చూస్తే ప్రాధాన్యమైనవే అని చెప్పాలి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటివి సీనియర్ మంత్రులు గతంలో నిర్వహించినవి. పవన్ వాటికే కోరుకున్నారు కాబట్టే ఇచ్చారు అని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. అయితే పవన్ రెండేళ్ల క్రితం కాకినాడ పర్యటనలో హోం శాఖ మీద ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. తాను కనుక హోం శాఖను తీసుకుంతే పరిస్థితి వేరే విధంగా ఉండేది అని కూడా అన్నారు. ఇది పరోక్షంగా మంత్రి అనిత మీద చేసిన కామెంట్స్ అని కూడా ప్రచారం జరిగింది. కొంత రాజకీయ చర్చ కూడా సాగింది. మళ్లీ ఇన్నాళ్ళకు పవన్ అదే కాకినాడ పర్యటనలో మళ్లీ హోం శాఖ గురించి మాట్లాడారు. తన చేతిలో హోం శాఖ లేదని ఆయన అన్నారు.

తొక్కి నార తీసేవాడిని :

తాను కనుక హోం మంత్రి అయి ఉంటే రౌడీయిజం గూండాయిజం చేసేవారిని తొక్కి నారా తీసేవాడిని అని పవన్ సంచలన వ్యాఖ్యలే చేసారు. దురదృష్టవశాత్తు లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని పవన్ అనడమూ విశేషమే. ఇదంతా ఆయన అనడం వెనక అంతరార్థం ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద ఇలా స్పందించారు అని అంటున్నారు. విజయవాడ కృష్ణలంకలో గాదె సాయి క్రిష్ణ లాకప్ డెత్ అయ్యారని వైసీపీ ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతోనే పవన్ ఈ కామెంట్స్ చేశారా అని చర్చ సాగుతోంది. నేరస్థులను ఎవరూ కాపాడలేరని కూడా పవన్ అనడం విశేషం. అంతే కాదు ఒక దళిత డ్రైవర్ ని నేరుగా ఇంటికే పార్సిల్ చేసినపుడు కులం ఎందుకు చూడలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు కొన్ని విషయాలే మాట్లాడుతారు అని తాను అన్ని విషయాలూ మాట్లాడుతాను అని పవన్ చెప్పడం గమనార్హం.

హోం శాఖ కోరుకుంటే :

ఇదిలా ఉంటే పవన్ ని కూటమి ప్రభుత్వ పెద్దలు బాగానే గౌరవిస్తారు అన్నది తెలిసిందే. ఆయన కోరుకుంటే హోం మంత్రి కావడం పెద్ద విశేషం కూడా కాదు కదా అని అంటున్నారు. సాధారణంగా ఉప ముఖ్యమంత్రులు ఉప ప్రధానమంత్రులు తీసుకునే ఏకైక శాఖ పవర్ ఫుల్ శాఖ హోం మంత్రిత్వ శాఖ అన్నది తెలిసిందే. హోం మంత్రి అంటే కేబినెట్ లో నంబర్ టూ ర్యాంక్. మరి పవన్ అడిగారా లేక తాను మక్కువ ఎక్కువగా చూపించే పంచాయతీ రాజ్ వంటివి ఆయన తీసుకున్నారా అన్నది పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని ఆయన అనడం మీద మాత్రం బాగానే చర్చ సాగుతోంది.

మళ్ళీ గెలుస్తానో లేదో :

ఇక పవన్ కాకినాడలో నిర్వహించిన మన ఊరు-మాటా మంతి కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మళ్లీ గెలుస్తానో లేదో అంటూ కూడా కామెంట్స్ చేశారు. తాను గెలిచినా లేకపోయినా ప్రజల కోసం పోరాటాలు మాత్రం చేస్తూనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ చూస్తే కనుక పవన్ ప్రసంగం మీద చర్చ సాగుతోంది.