Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పనిసరా? వైద్యులు ఏమన్నారంటే?

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   30 Jun 2026 9:26 AM IST
పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పనిసరా? వైద్యులు ఏమన్నారంటే?
X

ఈ మధ్యకాలంలో హీరోలు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అభిమానుల కోసం ఎంత కష్టాన్నైనా అనుభవిస్తూ.. సినిమాలు చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి సమస్య తీవ్రతరం చేసినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యానికి సమయాన్ని కేటాయిస్తూ చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. అయితే తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ హాస్పిటల్ పాలయ్యారు అని తెలిస్తే మాత్రం అభిమానులు ఆందోళన పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాస్పిటల్ కి వెళ్ళిన పవన్ కళ్యాణ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు అధికారం అంటూ తలమునకలవుతూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సడన్ గా సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో తన భార్య అన్నా కొణిదెలతో కలిసి దర్శనం ఇవ్వడంతో అందరిలో అనుమానం మొదలైంది. అసలు పవన్ కళ్యాణ్ కు ఏమైంది? ఆయన ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రొటేటర్ కఫ్, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారట. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది.

శస్త్ర చికిత్స తప్పనిసరి..

సమస్య తీవ్రతరం కావడంతో హాస్పిటల్ కి వెళ్లగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. ఇక తక్షణమే శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారట.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ త్వరగా శస్త్ర చికిత్స చేయించుకొని, కోలుకోవాలని కోరుకుంటున్నారు.

OG 2 పై అంచనాలు..

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసిన ఈయనం త్వరలో ఓజీ సినిమా సీక్వెల్ ప్రారంభించబోతున్నారు. గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ.జి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో నటించనున్నారు. ప్రస్తుతం నాలుగు నెలల దీక్ష చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఈ దీక్ష పూర్తి కానుంది . ఇక సెప్టెంబర్ రెండవ తేదీన ఓజీ 2 సినిమా షూటింగ్ అనౌన్స్మెంట్ ప్రకటించి.. సెప్టెంబర్ చివరి వారంలో దీక్ష పూర్తి కాగానే షూటింగ్ సెట్లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సుజిత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టగా.. అటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ కూడా మ్యూజిక్ పనులు మొదలు పెట్టేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది.