Begin typing your search above and press return to search.

పవన్ సంచలన నిర్ణయం...ఆ జిల్లాతో స్టార్ట్ !

ఇక ఉత్తరాంధ్రాతో మొదలెట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వరసగా పర్యటించాలని పవన్ నిర్ణయించారు.

By:  Satya P   |   6 Oct 2025 11:00 PM IST
పవన్ సంచలన నిర్ణయం...ఆ జిల్లాతో స్టార్ట్ !
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర దగ్గర పడుతోంది. ఇంతకాలం ఆయన తన శాఖకు సంబంధించిన పనులల్లో తలమునకలు అయి ఉన్నారు. ఆరేడు శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. వాటితో పాటు తన శాఖల మీద పట్టు సాధించేందుకు ఆయన ఈ సమయం అంతా ఉపయోగించారు. మరో వైపు తాను కమిట్ అయిన సినిమాల విషయంలో ఆయన పూర్తి చేశారు. ఇక ఇపుడు పవన్ ఫోకస్ పెట్టాల్సిన అంశాలను వరసగా లైన్ లో పెడుతున్నారు అందులో భాగనే చాలా కాలంగా ప్రచారంలో ఉన్న జిల్లాల పర్యటనలు.

అధికారంలో ఉంటూ :

ఎవరైనా అధికారంలో ఉన్నపుడు జనాల వద్దకు వెళ్తేనే వారికి మేలు చేయగలుగుతారు. ప్రతిపక్షంలోకి వచ్చాకనే నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారు. పవర్ లో ఉంటే అంతా బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. దాని వల్లనే ఎన్నికల వేళకు ఇబ్బందులు ఎదురవుతాయి. నిజానికి అధికారంలో ఉన్న వారు జనాల వద్దకు వెళ్తే వారు ఏ సమస్యను అయినా చెప్పుకున్నా వెంటనే పరిష్కారం చూపించగలుగుతారు. ఒక విధంగా ఇదే కరెక్ట్ కూడా. ఓట్లేసిన ప్రజలు నాయకులు తమ వద్దకు రావాలని తమ సమస్యలను గురించి తెలుసుకోవాలని కోరుతారు. పవన్ ఈ విషయంలో బాగా ఆలొచించిన మీదటనే జిల్లాల యాత్రలను షురూ చేస్తున్నారు అని అంటున్నారు.

మొదట అక్కడికే :

ఇక పవన్ కళ్యాణ్ తన జిల్లాల పర్యటనను తొందరలోనే మొదలెడుతారు అని అంటున్నారు. ఆయన మొదటిగా వెళ్ళబోయేది పార్వతీపురం మన్యం జిల్లా అని అంటున్నారు. ఇక్కడ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు అనారోగ్యం పాలు అయ్యారు. దాంతో చాలా మంది ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్నారు. దాంతో అక్కడికే పవన్ తొలి ప్రాధాన్యతగా వెళ్తారని వారిని పరామర్శించి స్థానికంగా ఉన్న పరిస్థితులను గురించి తెలుసుకుని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు అని అంటున్నారు.

వరస పర్యటనలు :

ఇక ఉత్తరాంధ్రాతో మొదలెట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వరసగా పర్యటించాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా కాకినాడ జిల్లాలో పవన్ పర్యటించి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఆయన టూర్లు ఉంటాయని అంటున్నారు. ఇక రాజోలులో కూడా పవన్ పర్యటిస్తారు అని అంటున్నారు.

పార్టీతో భేటీలు :

ఇక అధికారిక పర్యటనలతో పాటు పార్టీ నేతలతో కూడా పవన్ ఈ సందర్భంగా భేటీలు వేస్తారని చెబుతున్నారు. ఆయన ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం ఇంచార్జిలు అలాగే వీర మహిళలు కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించి వారితో మాట్లాడుతారు అని అంటున్నారు అంతే కాదు స్థానికంగా పార్టీ పరిస్థితులను తెలుసుకుంటారని దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు.

రానున్న రోజులలో :

ఇక ఇదే తీరున రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాలలో పర్యటిస్తారు అని అంటున్నారు స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా అటు అధికారిక టూర్లలో ప్రభుత్వం చేపడుతున్న పధకాలను కార్యక్రమాలను పరిశీలిస్తారు అని అంటున్నారు. ప్రజలతో నేరుగా సమావేశం కావడం ద్వారా ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయాలను కూడా కనుగొంటారు అని అంటున్నారు. అలాగే పార్టీని పటిష్టం చేసుకోవడానికి కూడా వీటిని ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. రాబోయే మూడున్నరేళ్ళ పాటు ఇదే తీరున జనంతో పాటు పార్టీతో ఉండేలా పవన్ పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక కురుపాం లో గురుకుల విద్యార్ధినుల ఆరోగ్యం మీద ఇప్పటికే అధికారులతో ఆరా తీసిన పవన్ తొందరలో తాను వస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ జిల్లా పర్యటనలు మొదలైతే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ కదలిక అయితే వస్తుందని అంటున్నారు