Begin typing your search above and press return to search.

మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్పించిన‌ క్ర‌మ‌శిక్ష‌ణ‌: జ‌న‌సేనాని గురించి ఎవ‌రికీ తెలియ‌ని నిజాలు!

మార్షల్ ఆర్ట్స్ నుంచి సినిమాలు, రాజకీయ రంగం వరకు పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

By:  Sivaji Kontham   |   15 Aug 2026 12:38 PM IST
మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్పించిన‌ క్ర‌మ‌శిక్ష‌ణ‌: జ‌న‌సేనాని గురించి ఎవ‌రికీ తెలియ‌ని నిజాలు!
X

మార్షల్ ఆర్ట్స్ నుంచి సినిమాలు, రాజకీయ రంగం వరకు పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఇటీవల ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అభిమానుల నుంచి అపారమైన ప్రేమ వెల్లువెత్తింది. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయనలోని గొప్ప‌ క్రమశిక్షణ- సద్గుణాలు సంఘంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. నేడు ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌న్ లోని క్ర‌మ‌శిక్ష‌ణ‌, మంచి ల‌క్ష‌ణాల గురించి యువ‌త‌రం సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై మ‌రోసారి చ‌ర్చిస్తోంది.

పవన్ కళ్యాణ్ పై అభిమానులు చూపే ఆత్మీయత ఎంతో భావోద్వేగమైనది. దీనికి అభిమానుల కామెంట్లు పెద్ద ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తున్నాయి. `పుట్టింది నీ అభిమానిగానే.. శ్వాస విడిచేది నీ అభిమానిగానే! అంటూ సోషల్ మీడియా కామెంట్లలో అభిమానులు తమ నిష్కల్మషమైన ప్రేమను చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌ను కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో `టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్`.. `ది ఒరిజినల్ హీరో (OG)` అని అభివర్ణిస్తూనే... ఆయన సమాజానికి దిశానిర్దేశం చేసే ఒక `టార్చ్ బేరర్` లాంటి మనిషి అని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనలు, నిర్ణయాలు సమాజంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆయన యువతకు ఇచ్చిన సందేశం సమాజ నిర్మాణంలో వారి బాధ్యతను గుర్తుచేసింది. విధ్వంసక రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవస్థలను సరిచేయడమే అసలైన పురోగతి అని ఆయన స్పష్టం చేశారు.

దేశ విభజన గాయాల జ్ఞాపకార్థ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. 1947 నాటి విభజన వల్ల ఇళ్లను, కుటుంబాలను కోల్పోయి ల‌క్ష‌లాది మంది ప్రజలు అనుభవించిన ఆవేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ చీకటి రోజుల్లోనూ మన పూర్వీకులు ప్రదర్శించిన ధైర్యం- ఓర్పు - మానవత్వం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

గతంలోని కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని ఐక్యత- సామరస్యం- శాంతితో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. విభజనలను గుర్తుచేసుకోవడం అంటే గతాన్ని తవ్వుకోవడం కాదని.. రేపటి మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడమేనని స్వాతంత్య్ర దినోత్స‌వ సామాజిక‌ నోట్‌ లో జ‌న‌సేనాని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందుతున్నారు.