విజయ్ ప్రభావం...జనసేనాని సంచలన వ్యాఖ్యలు !
ఇల లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చావగొడుతున్నారని కామెంట్స్ చేశారు.
By: Satya P | 26 May 2026 6:47 AM ISTతమిళనాడులో గట్టిగా రెండేళ్ళ క్రితమే పార్టీ స్థాపించి సీఎం అయిపోయారు దళపతి విజయ్. తమిళనాడు విజయం ఏపీలో ప్రభావం చూపిస్తుందని అందునా జనసేన మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంతా విశ్లేషించారు. చూస్తూంటే జనసేనలో ఆ ప్రభావం అధికంగానే ఉన్నట్లుగా అనిపిస్తోంది అంటున్నారు. టీవీకే విజయం తరువాత పవన్ రెండు సార్లు పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఒకటి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉద్యమి సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు. రెండు రాజమండ్రిలో తాజాగా కార్యకర్తలతో ఆయన మాట్లాడిన మాటలు. ఈ రెండూ విన్నపుడు జాగ్రత్తగా విశ్లేషించినపుడు తెలియకుండానే జనసేన మీద విజయ్ పార్టీ ప్రభావం ఉందా అన్న చర్చ అయితే జోరుగా సాతుతోంది.
ముఖ్యమంత్రి అంటూ చావగొట్టారు :
ఇల లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చావగొడుతున్నారని కామెంట్స్ చేశారు. పొరుగున రాష్ట్రంలో చేసిన రాజకీయాలు చాలా సుఖంగా తనకే అసూయ కలిగేటంతగా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా అక్కడ కటౌట్లతో హోలోగ్రామ్ తో ప్రచారం చేసి సీఎంలు అయ్యారని అన్నారు. ఇక తనను అయితే రోడ్ల మీద డేకించారని ఆయన చెప్పడమూ ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. ఇలా పదే పదే పవన్ నోటి వెంట టీవీకే విజయ్ ప్రస్తావన రావడం జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఉద్యమి పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఏపీ వేరు తెలంగాణా వేరు అని అన్నారు. ఈసారి మాత్రం కాస్తా ముందుకెళ్ళి తనకు సూపర్ స్టార్ డం ఉందని చెప్పుకున్నారు.
అపరిమితమైనది అంటూ :
తనకు సినిమాలలో ఉన్న ప్రజాదరణ ఎక్కువ అని పవంచ్ చెబుతూ సూపర్ స్టార్ డం ఉందని అన్నారు. తాను ఈ రోజుకీ వెనక్కి వెళ్ళి సినిమాలు చేసుకుంటే ఓజీ లాంటి హిట్లు ఇవ్వగలను అన్నారు. కానీ తనకు రాజకీయాలు ఇష్టమని అన్నారు. అంతే కాదు తాను ప్రజల కష్టాలను చూసి రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. ఇదే స్పీచ్ లో మరో సందర్భంలో ఆయన 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినపుడు తాను సీఎం కి ప్రయత్నం చేయలేకనా అని కూడా అన్నారు. ఇంకో మాటలో జగన్ అరెస్ట్ అయితే తాను సీఎం అవుతానా అంటూ ప్రశ్నిస్తూ అలాంటి ఎదుగుదల అవసరం లేదని జనసేన తానుగా ఎదుగుతుందని కూడా ఆయన చెప్పారు.
సీఎం చుట్టూనే :
ఇవన్నీ చూస్తూంటే పవన్ మాటలను బట్టి విజయ్ పార్టీ ప్రభావం అయితే జనసేన మీద గట్టిగానే ఉందని అంటున్నారు. తనకు సూపర్ స్టార్ డం ఉందని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవి గురించి చేసిన కామెంట్స్ చూస్తే కనుక రానున్న కాలంలో జనసేన ఆలోఅనలు రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా పవన్ చెప్పినట్లుగా ఆయనకు అత్యంత ప్రజాదరణ ఉంది. ఆయన సీఎం మెటీరియల్ అన్నది అంతా అంటున్న మాటే. మరి సంకీర్ణ ధర్మం కూటమి రాజకీయాలు పవన్ చెబుతున్నట్లుగా ఏపీలో ఉన్న సామాజిక రాజకీయ నేపథ్యం ఇవన్నీ చూసుకుంటూ జనసేన తగిన వ్యూహం రచిస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
