పవన్ సీఎం కావాలి...జనసేన ఎమ్మెల్యే సంచలనం !
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
By: Satya P | 26 Sept 2025 9:01 AM ISTజనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే జనసేన క్యాడర్ మాత్రం పవన్ ని సీఎం గానే చూస్తోంది. ఆయన ఏ రోజుకు అయినా ముఖ్యమంత్రిగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తుంది. అయితే ఇపుడు ఈ మాటలు అన్నది కార్యకర్తలు అభిమానుల నుంచి కాదు ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక కీలక నాయకుడి నుంచి వచ్చినది. దాంతో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రజల కోసం పవన్ :
గోదావరి జిల్లాలలోని తాడేపల్లిగూడెం కి చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా ముఖ్యమంత్రిగా పవన్ కావాలని ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం రేకెత్తించారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. అంతే కాదు ఆయన సీఎం కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. పవన్ సామర్థ్యం కానీ ఆయన నాయకత్వ లక్షణాలు కానీ ఆయన ముక్కుసూటితనం కానీ చాలా గొప్పవని బొలిశెట్టి ప్రశమించారు. అంతే కాదు జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పవన్ ఎంతగానో విలువ గౌరవం ఇస్తారు అని కూడా అన్నారు. పవన్ రాజకీయ రంగ ప్రవేశానికి చిరంజీవి కారణం అని కూడా అన్నారు.
కూటమి హయాంలో అభివృద్ధి :
మరో వైపు ఆయన కూటమి ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి నిధుల కొరత ఉందని అంటూనే వాటిని అధిగమిస్తూ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం తాపత్ర్యపడుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రగతి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
రిటైర్ అయిపోతా :
అంతే కాదు తన రాజకీయ రిటైర్మెంట్ మీద బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అయిదేళ్ళు మాత్రమే తాను ఉంటాను అని ఆ మీదట తాను రాజకీయాల్లో కొనసాగను అని స్పష్టంగా చెప్పేశారు. మొత్తం మీద బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలలో సంచలనమే కాదు అనేక రకాలిన విషయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవిపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నారు. తాజాగానే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. గుంతలు పాడైన రోడ్లకు మోక్షం కల్పించాలని ఆయన సభా ముఖంగానే విన్నవించారు. పదిహేను నెలలు అవుతోందని అయినా రోడ్ల దుస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన పవన్ సీఎం అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అంతా ఆలోచిస్తున్నారు.
