లోకల్ బాడీ ఎలక్షన్స్: కూటమి ధర్మం పాటిద్దాం.. పవన్
ఈ వ్యవహారం తనకు కూడా తెలుసునని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
By: Garuda Media | 21 Aug 2026 4:00 AM IST``2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో కూటమి ధర్మాన్ని ఏ విధంగా అయితే పాటించామో.. ఇప్పుడు కూడా అదే ధర్మం పాటిద్దాం. ఎవరూ పార్టీలైన్‌కు భిన్నంగా నోరు విప్పద్దు. ఏదైనా ఉంటే అంత ర్గత సమావేశాల్లోనే చర్చించాలి. లేదా లిఖిత పూర్వకంగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చు.`` అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
గురువారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్ఘల(లోకల్ బాడీ) ఎన్నికల విషయంపై నాయ కులు చర్చించారు. పార్టీ తరఫున 12 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ పడుతున్నారంటూ.. ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ వ్యవహారం తనకు కూడా తెలుసునని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని.. కూ టమి ధర్మానికి అందరూ కట్టుబడి పనిచేయాలని.. అలాగని కష్టపడిన వారిని పక్కన పెట్టే ప్రసక్తి లేదన్నా రు. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరంగా బలంగా పనిచేస్తున్న కార్యకర్తల వివరాలను సేకరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
గతంలో ఎలా అయితే.. సమన్వయం చేసుకుని ఎన్నికలకు వెళ్లామో.. ఇప్పుడు కూడా అదే తీరుగా వ్యవ హరించాలని పవన్ సూచించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అంశా లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఆశిస్తున్న రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు వంటివాటిపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఎవరూ పార్టీ లైన్‌కు, కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించరాదని పేర్కొన్నారు.
