పవన్ టార్గెట్ వారే...సక్సెస్ ఫుల్ ఫార్ములాతో !
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా పకడ్బందీగానే అని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల మీద గట్టి ఆశలే పెట్టుకున్నారు.
By: Satya P | 13 Jun 2026 8:15 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. నిజానికి పవన్ రాజకీయ వ్యూహాలు ఎపుడూ ముందుగానే రెడీ చేసిపెట్టుకుంటారు. దానికి ఉదాహరణ 2019లో జనసేన ఓటమి చెందిన వెంటనే 2020 జనవరి నాటికల్లా బీజేపీతో పొత్తు కలిపారు. అది 2024 ఎన్నికల్లో కూటమికి ముందున్న దీర్ఘకాలిక వ్యూహమే అని అంటారు. ఆ తరువాత టీడీపీని 2023లో కలుపుకున్నారు. ఇలా పవన్ వ్యూహం ఫలించి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ గద్దె దిగాల్సి వచ్చింది.
యూత్ కనెక్ట్ గానే :
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా పకడ్బందీగానే అని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల మీద గట్టి ఆశలే పెట్టుకున్నారు. ప్రస్తుతం జనసేనకు అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ నంబర్ ని వీలైతే రెట్టింపు చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా కూడా పవన్ బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇక పవన్ యూత్ ని కనెక్ట్ అయ్యే విధంగా పార్టీ స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున వారే :
ఇక ఏపీలో చూస్తే 2029 ఎన్నికల నాటికి యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారని పవన్ లెక్క వేస్తున్నారు. ప్రతీ అయిదేళ్ళకూ ఓటు హక్కు కలిగిన వారు లక్షల్లో ఉంటారు. దాంతో పాటుగా యువతరం అంతా ఎపుడూ ఫ్రెష్ నెస్ ని కోరుకుంటుంది. దాంతో పాటు కులాల వివాదాలు అలాగే ప్రాంతీయ వివాదాలు వంటి వాటిని యూత్ అసలు సహించదు. ఇపుడు పవన్ కూడా యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి అదే పంధాను అనుసరిస్తున్నారు. ఆయన తాజాగా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తనకు కులం ముద్ర అంటగట్టవద్దు అని కోరారు. అంతే కాదు తెలంగాణాకు ఆయన వెళ్ళి అక్కడ ప్రాంతీయ తత్వం మీద నిలదీశారు. తెలంగాణా భారత్ లో అంతర్భాగం కాదా అని కూడా నిలదీశారు.
కీలక వ్యాఖ్యలతో :
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలన సందర్భంగా తిరుపతిలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ కులం ప్రాంతీయ తత్వం మీదనే ఫోకస్ చేశారు. ఏపీ కుల భావన హద్దులు దాటాలని తెలంగాణా ప్రాంతీయ తత్వం వీడాలని ఆయన కోరారు. ఇలా ఆయన సూచించడం వెనక యూత్ ని ఆకట్టుకునే విధానం ఉందని అంటున్నారు. యువత కూడా ఎటువంటి బౌండరీస్ ని పెట్టుకోదు. వారికి కులం ప్రాంతం వర్గం వర్ణం భావన అంటే ఇష్టం ఉండదు, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే పవన్ యువత ఆలోచనలకు దగ్గరగా జనసేనను తీసుకెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు.
తలచుకుంటే విజయమే :
ఇక తమిళనాడులో విజయ్ కులం ప్రస్తావన చేయలేదు, ఆయన ఏ వర్గాన్ని నెత్తిన పెట్టుకోలేదు. దాంతో యువతకు ఆయన బాగా నచ్చేశారు. పెద్ద ఎత్తున యువత మహిళ విజయ్ టీవీకే పార్టీకి ఓటు చేయడంతో ఆయన ఘన విజయం సాధించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే విజయ్ సాధించిన ఈ విజయం తాను మరో మూడేళ్ళు ఎన్నికలు ఉన్న నేపధ్యంలో చేయలేనా అన్నది కూడా పవన్ ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే యూత్ లీడర్లుగా జగన్ లోకేష్ పవన్ మాత్రమే ఉన్నారు. వీరిలో జగన్ అయిదేళ్ళ పాటు సీఎం గా చేశారు. పైగా ఆయన మీద కేసులు ఉన్నాయి. పవన్ విషయంలో అలాంటివి లేవు అని అంటున్నారు. దాంతో యువతను కులాలకు ప్రాంతాలకు అతీతంగా కూడగడితే ప్రయోజనం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. జనసేనలో సాధిక్ లను కూడా యూత్ నుంచి సెలెక్ట్ చేయడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు.
