రాష్ట్రానికి దూరంగా పవన్...ఎందుకంటే ?
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు ఆయన జనసేన అధినేత. అలాగే పవర్ స్టార్ కూడా.
By: Satya P | 22 Aug 2026 9:55 AM ISTపవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు ఆయన జనసేన అధినేత. అలాగే పవర్ స్టార్ కూడా. ఎంతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దూరంగా ఇరవై రోజుల పాటు ఉండబోతున్నారు. పవన్ ఎపుడూ ఇన్నాళ్ళు సొంత రాష్ట్రానికి దూరమా ఉండలేదు. ఇది తొలిసారి అని అంటున్నారు. ఎందుకు అంటే పవన్ ప్రకృతి వైద్యం కోసం అని అంటున్నారు. ఇక పవన్ వైద్యుల సూచన మేరకు తన కుడి భుజానికి ఆయుర్వేద థెరపీ చేయించుకునేందుకు శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్తున్నారు.
తదుపరి చికిత్సలో భాగం :
ఇక ఇటీవల చూస్తే . ఇటీవల ముంబైలో పవన్ తన కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారని అంటున్నారు. నిజానికి శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని పవన్ కి తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలక్లు అలాగే విధులకి దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచించారు. కానీ పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఆయన వరుసగా శాఖాపరమైన సమీక్షలు చేశారు. అలాగే పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం వంటి వాటితో బిజీగా గడిపారు. ఈ క్రమంలోనే ఆయనకు శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతోపాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. దాంతో ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారని అంటున్నారు.
అభిమానుల ఆందోళన :
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కేరళంలో నేచురోపతి ఆయుర్వేద పంచకర్మ వైద్యం చేయించుకోనున్నారుని తెలుస్తోంది. ఆయన ఏకంగా సెప్టెంబర్ 10 దాకా అక్కడే ఉంటారని చెబుతున్నారు. పవన్ ఇన్నాళ్ళ పాటు రాష్ట్రానికి దూరంగా ఉండడం పట్ల అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే పవన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండడం కోసమే ఈ ప్రకృతి వైద్యం అని చెబుతున్నారు. ఈ ప్రకృతి వైద్యం అన్నది శాశ్వతంగా పవన్ కి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేరళంలోని ప్రకృతి వైద్యానికి దేశవ్యాప్తంగా పేరు ఉందని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడి ప్రకృతి వైద్యాన్ని నమ్ముతారు అని అంటున్నారు. అందుకే పవన్ ఈ నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు.
ఈ మధ్యన తరచూ అలా :
ఇక చూస్తే పవన్ తరచూ తీవ్రమైన జ్వరంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన కేబినెట్ మీటింగ్స్ కి కూడా హాజరు కాలేకపోతున్నారు. ఈ మధ్యనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎట్ హోం కి వెళ్ళకుండా ఆయన జ్వరంతో హైదరాబాద్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన కేరళం నేచరల్ థెరఫీ పట్ల దృష్టి సారించారు. ఇక పవన్ ఇన్ని రోజుల పాటు ఏపీలో ఉండరని తెలిసిన నేపథ్యంలో ఆయన మంత్రిత్వ శాఖలు ఎవరు చూస్తారు అన్న చర్చ సాగుతోంది. అయితే సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ శాఖలు చూస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఇరవై రోజులకు పైగా ఏపీకి దూరంగా ఉంటున్నారు. ఇది నిజంగా అభిమానులకు ఆందోళన కలిగించే వార్తే కానీ పవన్ క్షేమంగా లాభంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.
