Begin typing your search above and press return to search.

'భారతీయులను నమ్మకూడదు'... గట్టి షాక్ తగిలిందిగా!

అవును.. భారతీయులను నమ్మకూడదంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన పాల్‌ ఇంగ్రాసియాకు తాజాగా షాక్ తగిలింది.

By:  Raja Ch   |   22 Oct 2025 2:00 PM IST
భారతీయులను నమ్మకూడదు... గట్టి షాక్ తగిలిందిగా!
X

భారతీయులను నమ్మకూడదని.. వారిని ఎప్పటికీ మార్చలేమని.. పాల్‌ ఇంగ్రాసియా జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన సన్నిహితుల వద్ద భారతీయులపై విషం కక్కుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆయనకు తాజాగా ఎఫెక్ట్ పడింది. ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ అధిపతిగా ట్రంప్ ప్రతిపాదించిన ఈయనకు రిపబ్లికన్ల నుంచి మద్దతు కరువైంది. దీంతో ఆయన నామినేషన్‌ ను ఉపసంహరించుకున్నారు.

అవును.. భారతీయులను నమ్మకూడదంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన పాల్‌ ఇంగ్రాసియాకు తాజాగా షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతిగా ట్రంప్ ప్రతిపాదించిన ఈయనకు రిపబ్లికన్లు షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఈ పోస్ట్ విషయంలో అతడికి రిపబ్లికన్లు మద్దతు ఇవ్వలేదు. ఈ విషయాలను తాజాగా పాల్ ఇంగ్రాసియాతో పాటు సెనెట్ మెజార్టీ నాయకుడు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. ప్రస్తుతం తనకు కావాల్సినంత రిపబ్లికన్ల మద్దతు లేదని.. అందువల్ల సెనెట్‌ ప్యానెల్‌ ముందుకువెళ్లాల్సిన తన నామినేషన్‌ ను ఉపసంహరించుకుంటున్నట్లు పాల్ ఇంగ్రాసియా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో... అమెరికాను గొప్పగా మార్చేందుకు ట్రంప్‌ తో కలిసి నడిచేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

మరోవైపు... జాత్యహంకార సందేశాలకు సంబంధించి వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇంగ్రాసియా నామినేషన్‌ ను వైట్‌ హౌస్ వెనక్కి తీసుకుంటుందని సెనెట్‌ మెజార్టీ నాయకుడు జాన్‌ థూన్‌ ప్రకటించారు.

కాగా... తోటి రిపబ్లికన్లతో చేసిన చాటింగ్‌ లో భారతీయులను ఉద్దేశిస్తూ పాల్‌ ఇంగ్రాసియా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వారిని నమ్మకూడదని, వారిని ఎప్పటికీ మార్చలేమంటూ వ్యాఖ్యానించారు. దేశంలోని ఉన్నతస్థానాల్లో శ్వేతజాతీయులు మాత్రమే ఉండాలని, నల్ల జాతీయుల విషయంలో తనకు నాజీ తరహా ఆలోచనలు వస్తాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే.. భారతీయ-అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామిని ఉద్దేశిస్తూనే పాల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కథనాలొచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన ముగ్గురు ఇతర రిపబ్లికన్లు.. ఫ్లోరిడాకు చెందిన సెనెటర్ రిక్ స్కాట్, విస్కాన్సిన్‌ కు చెందిన రాన్ జాన్సన్, ఒక్లహోమాకు చెందిన జేమ్స్ లాంక్‌ ఫోర్డ్ కూడా ఇంగ్రాసియా ఎంపికను వ్యతిరేకిస్తామని చెప్పారు.