భారత పాస్ పోర్ట్ కొత్త బలం ఎంతో తెలుసా.. టాప్ కంట్రీస్ ఇవే!
అవును... ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదలయ్యింది. దీని ప్రకారం... భారత పాస్ పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది.
By: Raja Ch | 15 Jan 2026 10:00 AM ISTప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన దేశాలకు చెందిన పాస్ పోర్టులను గుర్తించే 'హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్' విడుదలయ్యింది. ఈ సందర్భంగా... వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల జాబితా తెరపైకి వచ్చింది. ఈ తాజా జాబితాలో గత ఏడాదితో పోలిస్తే భారత్ పాస్ పోర్ట్ ఐదు స్థానాలు మెరుగుతుపర్చుకుంది. ఇక ఎప్పటిలాగానే సింగపూర్ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో జపాన్, డెన్మార్క్ దేశాలు నిలిచాయి.
అవును... ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదలయ్యింది. దీని ప్రకారం... భారత పాస్ పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి గత ఏడాది భారత్ 85వ స్థానంలో ఉండగా, 57 దేశాలకు వీసా రహిత సౌకర్యం ఉండేది. ఈ ఏడాది నైజర్, అల్జీరియాలతో కలిసి భారత్ 80వ స్థానాన్ని పంచుకుంది. ప్రస్తుతం.. భారత పాస్ పోర్ట్ దారులు 55 దేశాలకు వీసా రహితంగా లేదా వీసా-ఆన్-అరైవల్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
తాజా నివేదిక ప్రకారం... ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మొదటి మూడు పాస్ పోర్టులు ఆసియా దేశాలవే కావడం గమనార్హం. ఇందులో భాగంగా.. ప్రపంచంలోని మొత్తం 227 దేశాలలో 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే హక్కుతో సింగపూర్ పాస్ పోర్ట్ మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా నిలిచింది. ఆ తర్వాత జాబితాలో 188 దేశాలకు ప్రయాణించేలా జపాన్, సౌత్ కొరియా దేశాల పాస్ పోర్ట్స్ రెండూ రెండో స్థానంలో నిలిచాయి.
ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా 179 దేశాలు ప్రయాణించే పాస్ పోర్ట్ తో 10వ స్థానంలో నిలవగా.. వీసా లేకుండా 81 దేశాలకు ప్రయాణించగల పాస్ పోర్టుగా చైనా 59వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 113 దేశాల వీసా ఫ్రీ డెస్టినేషన్ పాస్ పోర్టుతో రష్యా 46వ ర్యాంక్ లో ఉండగా.. 31 దేశాలకు మాత్రమే విసా రహిత ప్రయాణం చేయగల పాస్ పోర్ట్ తో పాకిస్థాన్ 98వ స్థానంలో నిలిచింది. ఇక అన్నింటికంటే చివరిగా కేవలం 24 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే పాస్ పోర్ట్ తో ఆఫ్ఘనిస్తాన్ 101వ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా టాప్ 5 పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ జాబితా ఇప్పుడు చూద్దామ్...! (ర్యాంకు - దేశం - వీసా ఫ్రీ డెస్టినేషన్స్)
1. సింగపూర్ - 192
2. జపాన్ - 188
2. సౌత్ కొరియా - 188
3. డెన్మార్ - 186
3. లక్సెంబర్గ్ - 186
3. స్పెయిన్ - 186
3. స్వీడన్ - 186
3. స్విట్జర్లాండ్ - 186
4. ఆస్ట్రియా - 185
4. బెల్జియం - 185
4. ఫిన్లాండ్ - 185
4. ఫ్రాన్స్ - 185
4. జర్మనీ - 185
4. గ్రీస్ - 185
4. ఐర్లాండ్ - 185
4. ఇటలీ - 185
4. నెథర్లాండ్ - 185
4. నార్వే - 185
5. హంగేరీ - 184
5. పోర్చుగల్ - 184
5. స్లోవాకియా - 184
5. స్లోవేనియా - 184
5. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 184
