ఇండిగో విమానంలో చెంప దెబ్బ... షాకింగ్ వీడియో వైరల్!
ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో భయాందోళనలు కలిగిస్తున్న పలు ఘటనలకు తోడు తాజాగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
By: Raja Ch | 2 Aug 2025 11:59 AM ISTఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో భయాందోళనలు కలిగిస్తున్న పలు ఘటనలకు తోడు తాజాగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు ఒక ప్రయాణికుడు. ఈ సమయంలో అతడిపై గట్టినా చెంపపై కొట్టడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.
అవును... తాజాగా ఇండిగో విమానంలో గందరగఓళం సృష్టించాడో ప్రయాణికుడు. ఇందులో భాగంగా... ముంబయి నుంచి కోల్ కతా వెళ్తున్న విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. దీంతో ఇతర ప్రయాణికులు అతడిని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఎందుకు కొట్టారని నిలదీశారు.
అయితే... 'అతడి వల్ల నాకు సమస్యగా ఉంది.. అందుకే కొట్టాను ' అని అతడు చెప్పడం గమనార్హం. ఈ సమయంలో... సమస్య ఎదురైతే సిబ్బందికి చెప్పాలి కానీ.. చేయి చేసుకుంటారా? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించారు. దీంతో... కోల్ కతా ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే ఈ ఫుటేజీని షేర్ చేసి ఎయిర్ లైన్స్ ప్రతిస్పందనను ప్రశ్నించారు. ఇందులో భాగంగా... నిందితుడైన ప్రయాణికుడిపై ఎయిర్ లైన్స్ ఎలాంటి చర్య తీసుకుంది? అతన్ని ఎందుకు దించేసి నో ఫ్లై లిస్ట్ లో పెట్టలేదు? అని అడిగారు.
ఈ సందర్భంగా ఇండిగో స్పందించింది. తమ విమానాలలో ఒకదానిలో భౌతిక ఘర్షణకు సంబంధించిన సంఘటన గురించి తెలిసిందని.. ఇటువంటి వికృత ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. తమ ప్రయాణీకులు, సిబ్బంది భద్రత, గౌరవం విషయంలో రాజీ పడేది లేదని.. వాటికి భంగం కలిగించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.
