Begin typing your search above and press return to search.

సెప్టెంబరు 21న పాక్షిక సూర్య గ్రహణం.. మనమీద ప్రభావం ఎంత?

మరో వారంలో ఇంకో గ్రహణం రానుంది. అవును.. ఈ నెల 21న అంటే ఆదివారం పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది.

By:  Garuda Media   |   13 Sept 2025 2:04 PM IST
సెప్టెంబరు 21న పాక్షిక సూర్య గ్రహణం.. మనమీద ప్రభావం ఎంత?
X

మొన్న ముగిసిన ఆదివారం వేళ.. చంద్రగ్రహణం చోటు చేసుకోవటం..ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జపాలు.. పూజలు.. శాంతులు చేయించటం చూశాం. మరో వారంలో ఇంకో గ్రహణం రానుంది. అవును.. ఈ నెల 21న అంటే ఆదివారం పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. మహాలయ అమావాస్య రోజున సంభవించేఈ గ్రహణం ప్రభావం మన మీద ఎంత ఉంది? అసలు.. మనకు ఈ సూర్యగ్రహణం వర్తిస్తుందా? లేదా? అన్నది కూడా ప్రశ్నే. దీనికి సంబంధించిన సమాధానాల్ని వెతికితే.. ఈ పాక్షిక సూర్య గ్రహణం మనకు వర్తించదనే చెప్పాలి.

ఎందుకుంటే.. ఈ పాక్షిక సూర్య గ్రహణం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. అంటార్కిటికా.. అట్లాంటిక్.. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడే సందర్భంలో మనకు రాత్రి కావటమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం ఈ పాక్షిక సూర్యగ్రహణం రాత్రి 10.59 గంటలకు మొదలై.. తెల్లవారుజామున 3.23 గంటల వరకు సాగనుంది. అంటే.. గ్రహణం చోటు చేసుకునే సమయం మొత్తం మన వరకు చంద్రుడి వెనుక సూర్యుడు ఉంటాడు.

అందుకే.. ఈ పాక్షిక సూర్యగ్రహణం మనకు వర్తించదనే చెప్పాలి. గ్రహణం అనేది.. యోగులు.. ఆధ్యాత్మిక సాధకులకు అద్భుతమైన అవకాశంగా చెబుతారు. ఆ స మయంలో చేసే జపాలు.. ధ్యానం.. దానాలు విశేష ఫలితాలు ఇస్తాయన్న నమ్మకం మనోళ్లకు ఎక్కువ. ఇదే విషయాన్ని పురణాలు.. హైందవ ధర్మం చెబుతుంటుంది. అందుకు ప్రతి గ్రహణాన్ని ప్రత్యేకంగా చూడటమే కాదు.. ఆ సందర్భంగా పలు శాంతులను సూచిస్తుంటారు.

ఇక.. త్వరలో చోటు చేసుకునే పాక్షిక సూర్య గ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది. అందుకే ఈ రాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మన దేశంలో ఇది కంటికి కనిపించకుండా ఉన్నప్పటికీ.. విదేశాల్లో ఉండే మనోళ్లు.. అందునా సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో సముద్రాల్లో అలజడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారు కాసింత అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.