సర్ పై నిరసనలు...నిర్మలమ్మ భర్త సైతం !
ఆమె దేశానికే ఆర్థిక మంత్రి. అధికార ఎన్డీయేలో అత్యంత కీలకమైన పోర్ట్ ఫోలియోను చూస్తున్నారు. అంతకు ముందు తొలి మహిళా రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు
By: Satya P | 21 Oct 2026 11:18 PM ISTఆమె దేశానికే ఆర్థిక మంత్రి. అధికార ఎన్డీయేలో అత్యంత కీలకమైన పోర్ట్ ఫోలియోను చూస్తున్నారు. అంతకు ముందు తొలి మహిళా రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. దేశంలో ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీలో ఆమె కీలక నాయకురాలిగా ఉన్నారు. ఇక ఆమె భర్త పరకాల ప్రభాకర్ ఏపీ రాజకీయాల్లో తెలిసిన పేరు. లెఫ్ట్ భావజాలం ఉన్న ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. 2014లో ఏపీలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో సలహాదారునిగా పనిచేశారు.
బీజేపీ విధానాలకు యాంటీగా :
ఇక ఎకనామిస్ట్ అయిన పరకాల ప్రభాకర్ బీజేపీ రైటిస్ట్ భావజాలానికి పూర్తి వ్యతిరేకం. ఆయన బహిరంగంగానే బీజేపీ ఆర్థిక విధానాలను విమర్శిస్తూ ఉంటారు. ఇక దేశంలో యాంటీ బీజేపీ ఉద్యమాలలో ఆయన చురుకుగా పాల్గొంటారు. ఓటు చోరీ మీద కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల విషయంలో కానీ పరకాల ప్రభాకర్ ఎపుడూ గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. డిబేట్లలో పాల్గొని ప్రభుత్వం తీరుని తప్పుపడుతూంటారు.
సర్ కి వ్యతిరేకంగా :
ఈ నేపధ్యంలో సర్ కి వ్యతిరేకంగా ఈ నెల 23న జరిగే దేశవ్యాప్త నిరసనలలో పరకాల ప్రభాకర్ పాల్గొంటున్నారు. ఆ రోజున ఢిల్లీలో జరిగే నిరసనలలో ఆయన హాజరు కావడం ఇపుడు చర్చగా సాగుతోంది. పీపుల్ అగైనెస్ట్ సర్ అలియెన్స్ పేరుతో సీజేపీ తో పాటు సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు, ఇతర ప్రముఖులు అంతా కలసి ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని అంటున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, రైతు నేత రాకేష్ టికాయత్, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సహా అనేక మంది పాల్గొంటున్నారు.
దేశ రాజధానిలోనే :
దేశ రాజధాని ఢిల్లీలోనే పరకాల ప్రభాకర్ పాల్గొనే ఈ కార్యక్రమం ప్రభుత్వానికి యాంటీగానే అన్నది తెలిసిందే. మరి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. దాంతో బీజేపీ మీద పరకాల విమర్శలు మరింత ఆసక్తిని పెంచనున్నాయి. రాజకీయాల్లో కానీ సిధాంతాలలో కానీ ఎవరైనా భిన్నమైన ఆలోచనలు చేయవచ్చు. అందులో అన్న దమ్ములు భార్యభర్తలు అని కాదు కుటుంబ సభ్యులలో భిన్నాభిప్రాయాలు అన్నవి సహజం. అయితే నిర్మల బీజేపీ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న క్రమంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా తన భావజాలాన్ని కానీ తన ఆలోచనలను కానీ పరకాల ముందుకు తీసుకుని వెళ్ళడమే ఇంట్రెస్టింగ్ పాయింట్ గా అంతా చూస్తున్నారు.
