Begin typing your search above and press return to search.

పానీపూరీ కోసం రోడ్డెక్కిన మహిళ.. నాలుగే ఇచ్చారంటూ నడిరోడ్డుపై!

పానీపూరీ ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు..పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినే చిరుతిళ్లలో దీని పేరు ప్రథమంగా వినిపిస్తుంది.

By:  Garuda Media   |   20 Sept 2025 10:30 AM IST
పానీపూరీ కోసం రోడ్డెక్కిన మహిళ.. నాలుగే ఇచ్చారంటూ నడిరోడ్డుపై!
X

పానీపూరీ ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు..పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినే చిరుతిళ్లలో దీని పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ముఖ్యంగా పానీపూరీ తిన్నాక స్వీట్ పూరీ ఇవ్వకపోతే ఇచ్చేవరకు అక్కడే నిలబడి మరీ తినే జనాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మగవారితో పోల్చుకుంటే ఆడవారు ఈ పానీపూరీనీ మరింత ఎక్కువగా ఇష్టపడతారు అనడంలో సందేహం లేదు. ఎంత ఇష్టం అంటే ప్లేట్ పానీపూరీ తిన్నాక కచ్చితంగా మరో పూరి అడిగి తినే వారు కూడా లేకపోలేదు. ఇకపోతే సాధారణంగా ఒక ప్లేట్ పానీ పూరీ తీసుకుంటే అందులో ఐదు పూరీలు ఇస్తారన్న విషయం పానీ పూరీ తినే వారికి స్పష్టంగా తెలిసిందే. అందులో ఒక్క పూరీ తగ్గినా నానా రభస చేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది.

తనకు నాలుగే పానీపూరీలు ఇచ్చారు అంటూ ఒక మహిళ రోడ్డుపై బైఠాయించి గుక్కపెట్టి ఏడ్చి మరీ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గుజరాత్ లోని వడోదర ప్రాంతానికి చెందిన ఒక మహిళ సాయంత్రం వేళ సరదాగా పానీ పూరీ తినడానికి వెళ్లి.. ప్లేటుకు 20 రూపాయలు చెల్లించింది. బండి వ్యక్తి ఎప్పుడు ఇచ్చేలా ప్లేట్ కి ఆరు పూరీలు కాకుండా కేవలం నాలుగు పూరీలు మాత్రమే ఇవ్వడంతో మిగిలిన రెండు పూరీలు కూడా ఇవ్వాలని అతడితో ఆమె పట్టుబట్టింది. కానీ అతడు ధరలు పెరిగినందుకు ప్లేటుకు నాలుగు పూరీలే వస్తాయని చెప్పిన సరే ఆమె వినకుండా.. రెండు పూరీలు ఇస్తేనే కదులుతానని అతడితో గొడవ పెట్టుకుని మరీ రోడ్డు మధ్యలో కూర్చొనింది.

బండి వ్యక్తి ఎంత చెప్పినా కూడా వినలేదు. అయితే ఆమె రోడ్డు మధ్యలో కూర్చోవడంతో స్థానికంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా స్థానికులు, పోలీసులు అందరు కూడా ఆమెకు సర్ది చెప్పడంతో చివరికి అక్కడ నుంచి వెళ్లిపోయింది. నిజానికి ఈ ఘటన చూసేవారికి కాస్త హాస్యాస్పదంగా మారినా.. చాలామంది పానీ పూరీ ప్రియులు మాత్రం ప్లేటు పానీ పూరీలో ఒక్క పూరీ తక్కువైనా ఆ బాధ ఎలా ఉంటుందో దాని ప్రియులకు మాత్రమే తెలుస్తుంది అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇంకొంతమంది పానీ పూరి కోసం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో వాహనదారులు కూడా ఆమెపై అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.