Begin typing your search above and press return to search.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కి భారీ గిఫ్ట్ దక్కనుందా ?

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఆయన వరసగా రెండవ టెర్మ్ కూడా ఈ పదవిలో ఉన్నారు.

By:  Satya P   |   22 Jun 2026 9:44 AM IST
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కి భారీ గిఫ్ట్ దక్కనుందా ?
X

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఆయన వరసగా రెండవ టెర్మ్ కూడా ఈ పదవిలో ఉన్నారు. ఆయన పనితీరు పట్ల టీడీపీ అధినాయకత్వం పూర్తి సంతృప్తిగా ఉంది. దాంతో పల్లాకు భారీ గిఫ్ట్ తొందరలో దక్కే సూచనలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆయన చిరకాల కోరిక కూడా అలా నెరవేరుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటి పార్టీ పెద్దలు ఇచ్చే భారీ గిఫ్ట్ ఏంటి అంటే మ్యాటర్ వెరీ ఇంటరెస్ట్ మరి.

తండ్రి నుంచి వారసత్వం :

పల్లా తన తండ్రి పల్లా సింహాచలం నుంచి రాజకీయ వారసత్వం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పల్లా సింహాచలం టీడీపీలోనే ఉంటూ అనేక దశాబ్దాలుగా సేవ చేశారు. ఆయన ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి మాత్రం వరించలేదు. కార్మిక సంఘాల నాయకుడిగా విశాఖ జిల్లాలో బలమైన యాదవ సామాజిక వర్గం ప్రముఖుడిగా ఆయన సేవలు అందించారు. దాంతో విశాఖ జిల్లా నుంచి పల్లా సింహాచలాన్ని మంత్రిగా చూడాలని ఒక తరం ఎంతగానో తపన పడింది. కానీ అది మాత్రం జరగలేదు. ఇక ఆయన కుమారుడిగా పల్లా శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజారాజ్యం నుంచి అరంగ్రేట్రం :

పల్లా శ్రీనివాస్ ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే ఆనాటి అధికార కాంగ్రెస్ విపక్ష టీడీపీ ఓట్లు భారీగా చీలాయి. కాపు ప్లస్ యాదవ కాంబోతో ఆయన భారీ ఎత్తున ఓట్లను సాధించారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. విద్యాధికుడు సౌమ్యుడు అయిన పల్లాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ టెర్మ్ లో జరగలేదు. 2024లో అయితే ఏపీలోనే టాప్ మెజారిటీతో పల్లా గెలిచారు. దాంతో మినిస్టర్ పల్లా అని అంతా అన్నారు. కానీ ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కింది.

ఈసారి గ్యారంటీ అంటూ :

ఇక తొందరలో టీడీపీ కూటమి మంత్రి వర్గ విస్తరణ జరుపుతుందని అంటున్నారు. దాంతో పల్లాకు కచ్చితంగా మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. పైగా ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉండగానే మంత్రి చాన్స్ ఇస్తారని ఈ విధంగా జోడు పదవులతో డబుల్ బొనాంజా అని అంటున్నారు. తమ నాయకుడు మంత్రి కావాలని ఆయన అభిమానులు అయితే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక యాదవ సామాజిక వర్గం కూడా ఆశలు పెంచుకుంది. ఉత్తరాంధ్రా నుంచి ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదన్నదే వారి ఆవేదన. మొత్తానికి పునర్ వ్యవస్థీకరణలో పల్లా శ్రీనివాస్ కి మంత్రి యోగమే అని వస్తున్న ఊహాగానాలు నిజం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.