Begin typing your search above and press return to search.

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

మనీలా పర్యటనలో ప్రధాని మోదీ ప్రయాణించిన ఆటోపై పాకిస్తాన్ నెటిజన్లు తమదంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే ఆ ఆటో డ్యాష్‌బోర్డ్‌పై భారత సంస్థ బజాజ్ లోగో కనిపించడంతో వారి ప్రచారం తుస్సుమంది. ఫిలిప్పీన్స్‌లో ఆసియాన్ సదస్సు కోసం ఉపయోగించిన ఈ ఆటోలు భారత్ నుంచి ఎగుమతి అయినవని తేలడంతో పాక్ సోషల్ మీడియా ప్రచారం నవ్వులపాలైంది.

By:  A.N.Kumar   |   19 Nov 2026 8:37 AM IST
మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ
X

పక్కవాడి ఇంటి ముందున్న కారును చూసి అది మా షోరూమ్ నుంచే వెళ్ళింది అని చెప్పుకునే రకం కొందరుంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చాటుతుంటే.. అందులో తమ వాటా వెతుక్కోవడం పొరుగు దేశం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మనీలా పర్యటనలో భాగంగా చేసిన ఒక చిన్న ఆటో ప్రయాణం.. పాకిస్తాన్ సోషల్ మీడియాకు పెద్ద పండగలా మారింది. అయితే ఆ సంబరం కాస్తా నిమిషాల్లోనే నవ్వుల పాలైంది..

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన ఒక త్రీ-వీలర్ ఆటోలో మరో విదేశీ నేతతో కలిసి ప్రయాణించారు. ప్రపంచ నేతల రవాణా కోసం ఆతిథ్య దేశమైన ఫిలిప్పీన్స్ తమ దేశపు ప్రసిద్ధ 'జీప్నీ'ల కళాత్మక శైలిలో ఈ ఆటోలను ముస్తాబు చేయించింది. ఈ వీడియో బయటకు రావడమే ఆలస్యం.. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ రంగంలోకి దిగాయి. భారత ప్రధాని ప్రయాణించింది మా దేశంలో తయారైన ఆటోలోనే.. పాక్ ఆటోమొబైల్ రంగానికి ఇంతకంటే గొప్ప గుర్తింపు ఏం కావాలి? అంటూ ఒకటే ఊదరగొట్టాయి.

పాక్ నెటిజన్ల ఈ 'క్రెడిట్ చోరీ' ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెకర్లు.. నెటిజన్లు క్షణాల్లోనే తుస్సుమనిపించారు. ఆ ఆటో లోపలి దృశ్యాలను కాస్త జూమ్ చేసి చూడగానే అసలు నిజం బయటపడింది. ఆ వాహనం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై మన దేశపు దిగ్గజ సంస్థ ‘బజాజ్’ లోగో దర్జాగా మెరుస్తూ కనిపించింది. ఆటో తయారైంది భారత్‌లో ప్రయాణం జరిగింది ఫిలిప్పీన్స్‌లో.. కానీ మధ్యలో పాకిస్తాన్ జెండా ఎగరేయాలని చూసి ఆ దేశపు నెటిజన్లు అడ్డంగా దొరికిపోయారు.

నిజానికి పాకిస్తాన్‌కు చెందిన సజ్గర్ అనే త్రీ-వీలర్ కంపెనీ ఇటీవల ఫిలిప్పీన్స్‌లోని లగునాలో తన ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆగ్నేయాసియా మార్కెట్లోకి అడుగుపెట్టామన్న ఆనందంలో ఉన్న పాక్ నెటిజన్లు.. మనీలా రోడ్లపై కనిపించిన ప్రతి ఆటో తమదేనని భ్రమపడ్డారు. ఆసియాన్ సదస్సులో వాడినవి భారత్ నుంచి ఎగుమతి అయిన బజాజ్ ఆటోలని తెలుసుకోకుండానే ఏకంగా భారత ప్రధానికే తమ ఆటోలో లిఫ్ట్ ఇచ్చామని బిల్డప్ ఇచ్చుకున్నారు.

మోదీ ఆటోలో ప్రయాణించిన దూరం కంటే ఆ క్రెడిట్‌ను కొట్టేయడానికి పాక్ సోషల్ మీడియా పరిగెత్తిన దూరమే ఎక్కువగా ఉంది. ఆ ఆటో డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న చిన్న బజాజ్ లోగో కనిపించకపోయి ఉంటే పాక్ మీడియా ఈపాటికి దీన్ని తమ మేక్ ఇన్ పాకిస్తాన్ ఘనతగా ప్రకటించుకునేదేమో.. వస్తువు మనది.. వేదిక మరొకరిది.. కానీ ప్రచారం మాత్రం పాకిస్తాన్‌ది. ఇదీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ 'ఆటో కామెడీ' అసలు కథ..