Begin typing your search above and press return to search.

దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ దేశం

దరిద్రమంతా కట్టకట్టుకుని ఆ దేశంలోనే కొలువుందిట. అది అంతకంతకు పెరిగిపోతూ దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందంట.

By:  Satya P   |   9 Oct 2025 3:00 AM IST
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ దేశం
X

దరిద్రమంతా కట్టకట్టుకుని ఆ దేశంలోనే కొలువుందిట. అది అంతకంతకు పెరిగిపోతూ దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందంట. ఇంతకీ ఆ దరిద్రాన్ని నిండా కౌగిలించుకున్న దేశం ఏమిటి అంటే భారత్ దాయాది పాకిస్థాన్ అని అంటున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.

పేదరికం తిష్ట :

పాకిస్థాన్ లో పేదరికం పూర్తిగా తిష్ట వేసింది అని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ పేదరికం అతి భయంకరంగా పెరిగిపోతోంది అని పేర్కొంది. కేవలం ఎనిమిదేళ్ళ కాలంలో గరిష్ట స్థాయికి ఇది చేరింది అని గుర్తు చేసింది. ఒక వైపు చూస్తే పాక్ ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నా ఆ దేశంలో పేదరికం ఎక్కడా తగ్గడం లేదని ఎత్తి చూపింది.

రక్షణ రంగం పైనే :

పాకిస్థాన్ తెచ్చిన రుణాలను దేశ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని అత్యధిక శాతం రక్షణ రంగం మీదనే వెచ్చిస్తోందని ప్రపంచ బ్యాంక్ కీలక నివేదికలో స్పష్టం చేయడం విశేషం. గ్రామీణాభివృద్ధిని పాకిస్తాన్ పూర్తిగా పక్కన పెట్టేసిందని కూడా పేర్కొంది ఫలితంగా పాకిస్థాన్ లని ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుని పోయిందని వివరించింది.

మధ్యతరగతి పోరాటం :

పాకిస్థాన్ లో మధ్యతరగతి వర్గాలు పెద్ద ఎత్తున జీవన పోరాటం చేస్తున్నా పేదరికం వైపే వారు జారిపోతున్నారని వెల్లడించింది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో చూసుకుంటే పాకిస్థాన్ పేదరికం ఎప్పుడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక అసలైన నిజాలు బయటపెట్టింది. కేవలం రెండేళ్ళ కాలంలో అంటే 2023 నుంచి ఈ రోజుకు ఏకంగా ఏడు శాతం పేదరికంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది అంటే పాక్ దారుణమైన స్థితిలో ఉందని అర్ధమని చెబుతోంది.

గ్రామాల నిర్లక్ష్యం :

పాకిస్థాన్ గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది అని ఈ నివేదిక ఎత్తి చూపిస్తోంది. ఇక దేశంలోని మొత్తం జనాభాలో 42.7 శాతంగా మధ్యతరగతి వర్గాలు ఉన్నాయని వారంతా కూడా కనీస ఆర్ధిక భద్రత కోసం అల్లల్లాడుతున్నారు అంటే పాకిస్థాన్ ఏ విధంగా ఇబ్బంది పడుతోంది అన్నది కళ్ళకు కట్టినట్లుగా ఈ నివేదిక చూపించేస్దింది.

బలహీనంగా ఆర్ధికం :

పాకిస్థన్ ఈ రోజున ఆర్ధికంగా అత్యంత బలహీనంగా ఉందని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది అంతే కాదు దేశ ఆర్ధిక పునాదులే చాలా వీక్ గా ఉన్నాయని చెబుతోంది. ఏ మాత్రం అలక్ష్యం చేసినా మొత్తానికి మొత్తం దేశ జనాభా పేదరికం అంచుల్లోకి జారిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తోంది అయితే పాక్ మాత్రం తెల్లారి లేస్తే భారత్ మీద అసూయతో అక్కసుతో దారుణమైన విమర్శలు చేస్తోంది. ఆర్భాటాలు చేస్తోంది. రక్షణ రంగం మీద పెట్టుబడులు పెడుతూ పేదల పొట్ట మాడుస్తోంది. నిజానికి పాక్ కి భారత్ నుంచి ఏ రకమైన ప్రమాదం లేదు, కానీ పాకే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి ముందు తన దేశాన్ని చక్కదిద్దే పనిలో పాక్ సీరియస్ గా దిగకపోతే రానున్న కాలంలో ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుందని అంటున్నారు.