ఉగ్రవాద పాకిస్తాన్ మొసలి కన్నీరు: ఆత్మాహుతి దాడి వెనుక భారత్ అంటూ విషం!
అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)ను భారత్ ఆడించే 'తోలుబొమ్మ'గా షరీఫ్ అభివర్ణించారు.
By: A.N.Kumar | 11 Nov 2025 9:09 PM ISTప్రపంచంలోనే ఉగ్రవాదానికి కర్మాగారంగా పేరుగాంచిన దేశం పాకిస్తాన్. అగ్రరాజ్యం అమెరికానే ఏమార్చి, విమానాలతో ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్ లాడెన్‌ను సైతం పదేళ్లపాటు తమ దేశంలో దాచిపెట్టి పోషించిన చరిత్ర పాక్‌ది. అలాంటి దేశం తన శత్రు దేశమైన భారత్‌పై ఏళ్ల తరబడి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ముంబై బాంబు పేలుళ్ల నుండి మొన్నటి పహల్గాం, నేటి ఢిల్లీ పేలుళ్ల వరకు సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తోంది.
* భారత్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసంబద్ధ ఆరోపణలు
అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి అడ్డాగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌పై విషం చిమ్ముతోంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా ఆరోపించడం విడ్డూరం. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు.
* టీటీపీ భారత్ ఆడించే 'తోలుబొమ్మ' అట!
అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)ను భారత్ ఆడించే 'తోలుబొమ్మ'గా షరీఫ్ అభివర్ణించారు. ఈ సంస్థ అమాయక చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని.. దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు. తన దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులకు పరోక్షంగా భారత్‌నే బాధ్యురాలిని చేయాలని చూస్తున్నారు.
* 'పామునే తనను కాటేస్తున్నారని' అనడం!
ఉగ్రవాదాన్ని పెంచి పోషించి.. ప్రపంచ దేశాలన్నింటిపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పే పాకిస్తాన్.. ఇప్పుడు తన దేశంలో జరిగే ఉగ్ర దాడులకు భారత్‌పై నిందలు వేయడం 'పామునే తనను కాటేస్తున్నానని' అనడం లాంటిదని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, భారతీయులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూ.. దాన్ని దేశ విధానంగా వాడుకుంటున్న పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే తిరుగుబాటు చేస్తే దానికి కారణం భారత్ అని చెప్పడం హాస్యాస్పదం.
ప్రజాస్వామ్యాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ పాదాల చెంత ఉంచి డమ్మీగా మారిన ప్రధాని షరీఫ్.. అంతర్గత వైఫల్యాలు, ఆర్మీ ఆధిపత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* భారతీయుల నిరసన
భారత్‌పై పాక్ ప్రధాని చేసిన ఈ అసంబద్ధ ఆరోపణలను భారత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముందు తమ దేశంలో ఉన్న ఉగ్రవాదానికి పుల్‌స్టాప్ పెట్టి తమ సరిహద్దులను సరిదిద్దుకోవాలని హితవు పలుకుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పాకిస్తాన్.. భారత్‌పై ఏడవడం కేవలం రాజకీయ నాటకం అని భారతీయులు కడిగిపారేస్తున్నారు.
