పీఓకే వస్తానంటోంది...భారత్ ఓకేనా ?
పీఓకే...పాక్ ఆక్రమిత కాశ్మీర్. దీనిని భారత్ పాక్ స్వాతంత్రానికి ఉన్నంత చరిత్ర ఉంది. ఎనభయ్యేళ్ళుగా పాక్ ఆక్రమణలో కాశ్మీర్ లోని మూడవ భాగం ఉంది.
By: Satya P | 1 July 2026 9:31 AM ISTపీఓకే...పాక్ ఆక్రమిత కాశ్మీర్. దీనిని భారత్ పాక్ స్వాతంత్రానికి ఉన్నంత చరిత్ర ఉంది. ఎనభయ్యేళ్ళుగా పాక్ ఆక్రమణలో కాశ్మీర్ లోని మూడవ భాగం ఉంది. దీనిని పాకిస్థాన్ ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తోంది. కానీ వారిని మాత్రం ఏ విధంగానూ తమ పాలనలో ఆదుకోకుండా అక్కడ ఖనిజాలను సహజ వనరులను తీసుకుంటూ నానా రకాలైన బాధలు పెడుతోంది అని అంటున్నారు. దాంతో విసుగెత్తిన పీఓకే వాసులు అంతా భారత్ వైపు చూస్తున్నారు. భారత్ లో చేరిపోతామని కూడా పాక్ పాలకులను హెచ్చరిస్తున్నారు.
అప్పటి నుంచి వివాదాస్పదం :
పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ పరిపాలిస్తుంది.1947 నుండి భారతదేశం పాకిస్తాన్ ల మధ్య ఇది వివాదాస్పదంగానే ఉంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన గిల్గిట్ బల్టిస్తాన్ దక్షిణాన పాకిస్తాన్ పంజాబ్, పశ్చిమాన ఖైబర్ పఖ్తూన్‌క్వాలు ఉన్నాయి. తూర్పు వైపున జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ రెంటి మధ్య నియంత్రణ రేఖ కూడా ఒకటి ఉంది. భౌగోళికంగా, ఈ భూభాగం మొత్తం వైశాల్యం 13 వేల 297 కిలోమీటర్లు ఉంది. ముజఫరాబాద్ నగరం దాని రాజధాని. 2017 జాతీయ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40 లక్షల 45 వేల పై చిలుకు ఉంది. పీవోకే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం సేవలు, పర్యాటకం మీద ఆధారపడి సాగుతోంది.
భారీ ఎత్తున నిరసనలు :
ఇదిలా ఉంటే ప్రస్తుతం పీఓకేలో నిరసనలు భారీ ఎత్తున సాగుతున్నాయి. రావల్ కోట్‌లో 22 రోజులుగా సాగుతున్న ఈ ఆందోళనలలో పాల్గొంటున్న ప్రజలు అంతా పాకిస్థాన్‌లో మేం భాగం కాదంటున్నారు. తమను ఇబ్బంది పెట్టి ఆహార దిగ్బంధనం కొనసాగిస్తే భారత్ వైపు చూస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక పాక్ పాలకులు అయితే ఈ నిరసనలను అణచివేసేందుకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. మరో వైపు చూస్తే విదేశాల్లోని కశ్మీరీల నుంచి కూడా పీఓకే ఆందోళనలకు మద్దతు దక్కుతోంది. దాంతో రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని స్పష్టం చెయడమే కాదు ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు తేల్చేస్తున్నారు.
భారత్ వైపు చూస్తామని :
అంతే కాదు పాకిస్థాన్ ప్రభుత్వానికి నిరసనకారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ఆహారం నిత్యావసరాలను అడ్డుకుంటే తమ సరిహద్దులను భారత్ వైపు తెరుస్తామని వారు వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు పీఓకేను తమతోనే ఉండమని ఇస్లామాబాదే వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. పాక్ ప్రభుత్వ అణచివేత తో పాటు తీవ్రమైన ఆర్థిక కష్టాలు, ద్రవ్యోల్బణం, పాలనా వైఫల్యాలే ఈ నిరసనలకు ప్రధాన కారణాలని ఆందోళనకారులు చెబుతున్నారు. తమ నిరసనల సమాచారం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారని వారు మండిపడుతున్నారు.
భారత్ ఏమంటుంది :
పీఓకేలో ఉన్న ప్రజానీకం గతంలోనూ భారత్ వైపు మొగ్గు చూపారు. తమను ఆదుకోవాలని కూడా ఆందోళనకారులు కోరుతూ వచ్చారు. అయితే భారత్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే పీఓకేలో ఆందోళనలు పాక్ కి అతి పెద్ద తలనొప్పిగా మారాయి. అది పాక్ లో అంతర సంక్షోభానికి దారి తీస్తోంది. పాక్ పాలకులకు ఇబ్బందికరంగా మారుతోంది. అందువల్ల దానిని అలాగే ఉండనీయడం బెటర్ అని అంటున్నారు. పీఓకే విషయంలో ఏ మాత్రం కొత్త ఆలోచనలు చేసినా భారత్ ఆ ఇబ్బందులు తన నెత్తిన వేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు. చూడాలి మరి భారత్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో.
