Begin typing your search above and press return to search.

భారత్ దెబ్బకు పాకిస్తాన్ ‘రాకెట్ ఫోర్స్’

భారత్ క్షిపణుల శక్తిని 'ఆపరేషన్ సింధూర్' ద్వారా రుచి చూసిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త సైనిక ప్రణాళికలతో ముందుకు వచ్చింది.

By:  A.N.Kumar   |   15 Aug 2025 2:00 AM IST
భారత్ దెబ్బకు పాకిస్తాన్ ‘రాకెట్ ఫోర్స్’
X

భారత్ క్షిపణుల శక్తిని 'ఆపరేషన్ సింధూర్' ద్వారా రుచి చూసిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త సైనిక ప్రణాళికలతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 'రాకెట్ ఫోర్స్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక దళం పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా యుద్ధ సమయంలో క్షిపణుల మోహరింపు, ఆపరేషన్లను పర్యవేక్షించనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ఫోర్స్‌కు సమకూరుస్తామని షరీఫ్ తెలిపారు.

ఈ ప్రకటనకు ముందు రోజు షెహబాజ్ భారత్‌పై మళ్లీ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సింధూ నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా భారత్ తీసుకుంటే సహించబోమని, ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సింధూ నది పాకిస్తాన్‌కు ప్రాణాధారం కాబట్టి ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ నాయకులు, సైనిక అధికారులు వరుసగా భారత్‌పై బెదిరింపులు చేస్తూ, కొత్త రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం, సైనిక సమీకరణలు పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిపుణుల దృష్టిలో ఇది పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ప్రజలు మర్చిపోయేలా చేయడానికి చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోంది.

- కీలక అంశాలు

భారత్ క్షిపణుల శక్తికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేక 'రాకెట్ ఫోర్స్'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. షెహబాజ్ సింధూ నది జలాల విషయంలో భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అణు బెదిరింపులకు పాల్పడ్డారు, భారత్‌ను 'మెర్సిడెస్', పాక్‌ను 'డంప్ ట్రక్'గా పోల్చారు.

ఈ బెదిరింపులు, సైనిక చర్యలు అంతర్గత రాజకీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు.