సంపద చూపిన సంపన్నులకు షాకిస్తోన్న పాకిస్తాన్ ప్రభుత్వం
ఇంటర్నెట్‌లో కొన్ని లైకులు సాధించాలనే ఉద్దేశంతో ఖరీదైన వస్తువులను, లగ్జరీ జీవనశైలిని చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ రోజుల్లో సొంత శైలి అయ్యింది.
By: A.N.Kumar | 25 Sept 2025 8:00 AM ISTఇంటర్నెట్‌లో కొన్ని లైకులు సాధించాలనే ఉద్దేశంతో ఖరీదైన వస్తువులను, లగ్జరీ జీవనశైలిని చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ రోజుల్లో సొంత శైలి అయ్యింది. అయితే పాకిస్థాన్‌లో ఈ అలవాటు ప్రమాదకరమవుతోంది. ఎందుకంటే అక్కడి సంపన్నులు తమ అసలు ఆదాయానికి తగినంత పన్ను చెల్లించకపోవడం ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించింది.
ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) స్పందన
ఇది గమనించిన పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) 40 మంది అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు, రియల్టర్లు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా పెట్టి వారి ఆదాయాలను, ఖర్చుల సరియైనదో లేదో పరిశీలిస్తోంది.
ఈ బృందం వారి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ చేసి వారి లగ్జరీ జీవితానికి సరిపడే ఆదాయం ఉందా లేదా అని ఆరాటంగా చెక్ చేస్తోంది. పన్ను మోసం నిర్ధారించబడితే, కొన్ని గంటల్లోనే కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా వారి ఖర్చులకు అవసరమైన సంపద ఎక్కడినుంచి వచ్చిందో కూడా వెనకేసారని పరిశీలిస్తున్నారు.
పాకిస్థాన్‌లో పన్ను వ్యత్యాసం
పాకిస్థాన్‌లో పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడంలో పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సూచించిన లక్ష్యాలను చేరడానికి పన్ను ఆదాయం పెంపు కీలకమైంది. ఆసియాలో పాకిస్థాన్‌లో పన్ను-జీడీపీ నిష్పత్తి అత్యల్పంగా ఉంది. అక్కడ కేవలం 2 శాతం మంది మాత్రమే ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తున్నారు.
విలాసవంతమైన పెళ్లి కేసు
FBR బృందం ఇటీవల ఒక పెళ్లి ఖర్చును విశ్లేషించి ఆశ్చర్యానికి లోనైంది. ఆ వేడుకకు మొత్తం 8.78 లక్షల డాలర్లు ఖర్చు చేశారు. ఇందులో 2.83 లక్షల డాలర్లు బంగారం, వజ్రాలపై, 1.24 లక్షల డాలర్లు వధువు దుస్తులపై ఖర్చు చేశారు. 400 మంది అతిథులు హాజరైన ఈ వేడుకలో డ్రోన్లు, విలాసవంతమైన విందు, ఆరు రోజుల పాటు కొనసాగిన వేడుకలు, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు ఉన్నాయి. FBR అధికారులు ఇలా ఖర్చులు గణనీయంగా ఎక్కువగా ఉన్న చాలా కేసులు ఉన్నాయని వెల్లడించారు.
పాకిస్థాన్‌లో సామాజిక మాధ్యమాల్లో లగ్జరీ జీవనశైలి చూపడం ఇప్పుడు కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, పన్ను సమస్యకు దారితీస్తోంది. సంపన్నులు తమ ఆదాయం.. ఖర్చుల సరిపోలికను చూపకపోవడం ప్రభుత్వానికి పెద్ద సవాల్. FBR యొక్క కొత్త పద్ధతులు ఇలాంటి మోసాలను తగ్గించడానికి.. దేశానికి సరియైన పన్ను వసూలు చేయడానికి దోహదపడతాయి.
