పాకిస్థాన్ ది ఎప్పుడూ నీచబుద్దే.. అమెరికాతో దోస్త్.. ఇరాన్ కు సాయం.. సీబీఎస్ సంచలన కథనాలు..
అమెరికా - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సంధిచేస్తాం అని చెప్తూనే ఒక దేశంకు సాయం చేస్తూ మరో దేశంను వంచిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ వెల్లడించడంతో బయటపడింది.
By: Tupaki Political Desk | 12 May 2026 11:30 AM ISTపొరుగున ఉన్నదాయాదీ దేశం పాకిస్థాన్ బుద్ధి ఎప్పుడూ తిన్నగా ఉండదు.. ప్రపంచంతో కలిసి ఉండాలి.. డెవలప్ కావాలనే ఆలోచన లేదు.. ఎవరిని మోసం చేయాలి.. ఎవరిని వంచించాలో ఆలోచిస్తూనే ఉంటుంది. అమెరికా - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సంధిచేస్తాం అని చెప్తూనే ఒక దేశంకు సాయం చేస్తూ మరో దేశంను వంచిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ వెల్లడించడంతో బయటపడింది.
ఒకవైపు మధ్యవర్తిగా ఉంటూనే మరోవైపు అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు సహకరించడం అనేది పాకిస్థాన్ మరోసారి రోగ్ నేషన్ అని తేలిపోయింది. అమెరికా ఆంక్షలు, దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ తన యుద్ధ విమానాలను పాక్ భూభాగంలో దాచిందనే వార్తలు పశ్చిమ దేశాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాకిస్థాన్ ఒకవైపు శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తూనే, మరోవైపు రహస్యంగా ఇరాన్ సైన్యానికి సహకరించిందని సీబీఎస్ న్యూస్ (CBS News) నివేదించింది.
సీబీఎస్ నివేదికలోని ముఖ్యాంశాలు
అమెరికా అధికారుల సమాచారం ప్రకారం పాక్ అనుసరించిన వ్యూహాలు ఇవే. అమెరికా వైమానిక దాడుల నుంచి తమ యుద్ధ విమానాలను కాపాడుకోవడానికి ఇరాన్ వాటిని పాకిస్థాన్‌లోని 'నూర్ ఖాన్' (Nur Khan) ఎయిర్ బేస్‌కు తరలించింది. ఏప్రిల్ ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిరోజులకే ఇరాన్ తన నిఘా విమానాలను (RC-130 వంటివి) పాక్‌కు పంపినట్లు సమాచారం. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాకుండా, ఇరాన్ తన పౌర విమానాలను రక్షణ కోసం అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, హెరాత్ విమానాశ్రయాల్లో కూడా పార్క్ చేసింది.
యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందన
ఈ కథనంపై అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. ఈ కథనం నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్య పాక్ పోషిస్తున్న మధ్యవర్తి పాత్రపై పూర్తిస్థాయిలో పునఃసమీక్ష అవసరమని పేర్కొన్నారు. గతంలో ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ రక్షణ శాఖాధికారులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, పాక్ ఇలా ఇరాన్‌కు సహకరించడంలో ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక వేళ ఈ కథనం నిజమని తెలిస్తే.. ట్రంప్ పాకిస్థాన్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? లేక తన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న నేపథ్యంలో సైలెంట్ గా ఉంటారా? అన్నది వేచి చూడాలి. ట్రంప్ గురించి, ఆయన బిజినెస్ ఐడియాలజీ గురించి తెలిసిన వారు ట్రంప్ సైలెంట్ గా ఉంటారని అంటుండగా.. అలా అయితే.. అమెరికా పౌరుల నుంచి వ్యతిరేక ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సీబీఎన్ వార్తలు నిజమైతే పాక్ మాత్రమే సందిగ్ధంలో పడదు.. ట్రంప్ కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉంది..
ఖండించిన పాకిస్థాన్
ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నగరానికి నడిబొడ్డున ఉంటుందని, అక్కడ భారీ సంఖ్యలో విమానాలను దాచడం అసాధ్యమని పాక్ అధికారులు వాదిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉండే అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను ఇప్పటికే 'చెత్త' అని కొట్టిపారేశారు. ఈ క్రమంలో పాక్ కుట్ర బయటపడితే ఆయన మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.
అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ఒకవైపు అమెరికా నుంచి సాయం పొందుతూ, మరోవైపు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం నిజమని తేలితే పాకిస్థాన్‌పై అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
