పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణం అదేనా?
పాకిస్తాన్ ఎప్పుడూ భారతదేశం మీద పగ సాధించాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేయడం తప్ప ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదు.
By: Madhu Reddy | 23 Aug 2025 6:00 PM ISTపాకిస్తాన్ ఎప్పుడూ భారతదేశం మీద పగ సాధించాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేయడం తప్ప ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఆర్థిక వ్యవస్థకు సరి సమానంగా ఉండేది.అలాంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.. మరి ఇంతకీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ క్షీణించడానికి కారణం ఏంటి..? ఎందుకు పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది?అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్తాన్ ఎప్పుడూ మతపరమైన తీవ్రవాదాన్ని రెచ్చగొడుతూ ఆర్థిక వ్యవస్థపై శ్రద్ధ పెట్టడం మానేసింది. మతపరమైన తీవ్రవాదం పెరగడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది అని కొన్ని నివేదికల్లో తేలింది. అయితే ది ఎక్స్పెస్ ట్రిబ్యూట్ నివేదిక 2023 జనాభా, గృహ గణన నుండి పొందిన డాటా ప్రకారం..పాకిస్థాన్లో దాదాపు 6 లక్షల మసీదులు,36వేల మతపరమైన సెమినరీలు ఉన్నాయి. ఇక 23 వేల కర్మాగారాలు మాత్రమే ఉన్నాయి అంటూ తెలియజేసింది.. ఇక ప్రణాళిక మంత్రి అహ్సాన్ ఇక్బాల్ విడుదల చేసిన 2023 జనాభా లెక్కల నివేదిక ప్రకారం చూస్తే.. పాకిస్థాన్లో 23 వేల కర్మాగారాలు, 6,04,300 చిన్న ఉత్పత్తి యూనిట్లు, 2,42,000 పాఠశాలలు, 11568 కాలేజీలు,214 యూనివర్సిటీలు,6,04,000 మసీదులు, 36,331 మదర్సాలు ఉన్నాయని తెలిపారు.
అయితే పాకిస్తాన్లో ఉన్న పాఠశాలలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నవేనని, వీటిలో 11,568 కాలేజీలు ఉన్నాయని,వీటిలో ప్రైవేట్ రంగం వాటా కూడా కొంచెం ఎక్కువగానే ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇక ఈ నివేదిక ప్రకారం సింధు ప్రావిన్సులు, పంజాబ్, కరాచీ ప్రాంతం ఆర్థిక సంస్థలు, శ్రామిక శక్తి రెండిట్లోనూ అత్యధిక సాంద్రతను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా , బలచిస్తాన్ లు అశాంతితో కూడిన ప్రదేశాలు. పాకిస్తాన్ దేశం మొత్తంలో 29,836 ప్రభుత్వ కార్యాలయాలు,10,452 సెమీ గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే 19,645 బ్యాంకులు ఉన్నాయి..
అయితే పాకిస్తాన్ ఆర్టిక వ్యవస్థ దెబ్బ తినడానికి కారణం అక్కడ ఉన్న వ్యాపారాలు చాలా వరకు చిన్న తరహావే. ఈ వ్యాపారాలు కొద్ది మందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తున్నాయి. అలా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణం అక్కడి ప్రజలకు సరైన ఉపాధి లేకపోవడమే. ఎప్పుడు మతపరమైన కల్లోలాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం తప్ప ప్రజలకు సరైన ఉపాధి కల్పించలేకపోతుంది పాకిస్తాన్ గవర్నమెంట్. అందుకే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి క్షీణిస్తోంది అని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి..
