ట్రంప్ ఇప్పుడు ఏమి అంటావ్.. పాక్ ఆర్మీ చీఫ్ పిచ్చి మాటలతో..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నిలబడి భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా అణ్వాయుధాలు, మిస్సైళ్ల గురించి మాట్లాడటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
By: A.N.Kumar | 11 Aug 2025 10:25 AM ISTఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాపును చూసుకొని బలుపు అనుకుంటున్నాడు. ఆ వాపు అమెరికా అయితే.. బలుపు పాకిస్తాన్.. అమెరికాకు ఆహ్వానించి చర్చలు జరపగానే పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నిలబడి భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా అణ్వాయుధాలు, మిస్సైళ్ల గురించి మాట్లాడటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించకపోవడంపై వివిధ విశ్లేషకులు, నిపుణులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు విశ్లేషకులు ట్రంప్ మౌనాన్ని పాకిస్తాన్‌కు పరోక్ష మద్దతుగా భావించారు. ఎందుకంటే ఒక దేశం అధినేతను తమ దేశానికి ఆహ్వానించి, ఆ వ్యక్తి మరో దేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆతిథ్య దేశం ఖండించకపోవడం సందేహాలకు తావిస్తుంది.
ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన భారతదేశానికి వ్యతిరేకంగా ఇటువంటి బెదిరింపులు అమెరికా నేలపై రావడం, అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దౌత్యపరంగా ఇబ్బందులు సృష్టించవచ్చని భావించారు.
ట్రంప్ గతంలో కూడా అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారని, అందులో భాగంగానే మునీర్‌ను కలిశారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ భేటీ తర్వాత మునీర్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ విధానాలను మరింత క్లిష్టంగా మార్చాయి.
మునీర్ వ్యాఖ్యలు సింధూ నదిపై డ్యామ్ నిర్మాణం, అణ్వాయుధాల వాడకం గురించి ఉండటం వల్ల, ఇవి కేవలం రాజకీయ అంశాలు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలు, శాంతికి సంబంధించిన తీవ్రమైన విషయాలుగా మారాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాయి. ఈ విషయంలో ట్రంప్ వైఖరిపై అధికారిక సమాచారం లేనప్పటికీ, భవిష్యత్తులో ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.
ఆసిమ్ మునీర్ ఏమన్నారంటే..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ‘భారత్ తన దేశానికి ముప్పు కలిగిస్తే “సగం ప్రపంచాన్ని” తమతో పాటు నాశనం చేస్తామని ఆసిమ్ మునీర్ బెదిరించాడు. సింధూ నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే, “పది మిస్సైళ్లతో” దాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. “సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు” అన్న వ్యాఖ్యతో ఆ ప్రాంత జల హక్కులపై పాకిస్తాన్ హక్కు వాదనను తెరపైకి తెచ్చాడు.. తమ దేశం అణ్వాయుధ శక్తి అని, మిస్సైళ్ల కొరత లేదని గర్వంగా చెప్పాడు.
- భారతదేశం కౌంటర్ ఏంటి?
పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారతదేశం తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి బెదిరింపులను భారత్ అలుసుగా తీసుకోవడం కంటే, దౌత్యపరంగా, సైనికపరంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచించారు. అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తడం, ఐక్యరాజ్యసమితితో సహా ఇతర అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాల ప్రకారం భారతదేశానికి ఉన్న హక్కులను బలంగా వినియోగించుకోవడం.భద్రతా పరంగా సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండటం, ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం.
పాకిస్తాన్ ఆర్థికంగా కుంగిపోయినప్పటికీ, ఆసిమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశం యొక్క అంతర్గత దూకుడు మనస్తత్వాన్ని, అంతర్జాతీయ వేదికలపై మద్దతు కోరుకునే వైఖరిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఆర్థికంగా అస్థిరంగా ఉన్న పాకిస్తాన్‌కు మరింత నష్టం కలిగిస్తాయి.
