Begin typing your search above and press return to search.

కాళ్ల బేరానికి వచ్చింది మరిచిన పాక్ ఆర్మీ చీఫ్.. భారత్ పై వ్యాఖ్యలు!

అవును... పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్, భారత్ కు వార్నింగ్ ఇచ్చారు! ఇందులో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్రలు చేస్తే దాడులు చేస్తామని బెదిరించారు.

By:  Raja Ch   |   17 Aug 2025 10:00 PM IST
కాళ్ల బేరానికి వచ్చింది మరిచిన పాక్ ఆర్మీ చీఫ్.. భారత్ పై వ్యాఖ్యలు!
X

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ దాదాపు నిత్యం భారత్ పై విషం కక్కుతూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తనను తాను రక్షకుడిగా చెప్పుకునేందుకు తాపత్రాయపడుతూ.. ఈ గ్యాప్ లో భారత్ పై మరోసారి అవాకులు, చెవాకులు పేలారు! భారత్ తో కలిసి ఆఫ్ఘాన్ పాక్ తమపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలపై స్పందించారు.

అవును... పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్, భారత్ కు వార్నింగ్ ఇచ్చారు! ఇందులో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్రలు చేస్తే దాడులు చేస్తామని బెదిరించారు. ఈ సమయంలో ఆఫ్ఘాన్ సర్కార్ తమ దేశంలోకి మిలిటెంట్లను పంపిస్తూ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాము ఆఫ్ఘాన్ పై జాలి చూపిస్తుంటే.. ఆ దేశం మాత్రం భారత్ తో కలిసి తమపైనే కుట్రంలు చేస్తోందని అన్నారు.

అనంతరం తనను తాను రక్షకుడిగా చెప్పుకునే తాపత్రయాన్ని చెబుతూ, తనకు పదవీ కాంక్ష లేదని చెప్పుకొచ్చారు మునీర్. దేశసేవ కోసమే భగవంతుడు తనను పుట్టించాడని.. ప్రజలను కాపాడటం తప్ప తనకు మరో ఆలోచన ఉండదని అన్నారు. పాక్ అధ్యక్షుడు జర్దారీని గద్దెదించి మునీర్‌ ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి "ఆపరేషన్ సింధూర్" తర్వాత మునీర్ కు 'ఫీల్డ్ మార్షల్' హోదా లభించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పైగా 1947లో ఏర్పడినప్పటి నుంచి ఆ దేశం సుమారు 34 ఏళ్ల పాటు సైనిక పాలనలో ఉంది. అయూబ్ ఖాన్, జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాట్ల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న చరిత్ర ఉంది.

ఈ సమయంలో.. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని మునీర్ స్పందించడం ఆసక్తిగా మారింది. పైగా మునీర్‌ తరచుగా అమెరికా పర్యటనలకు వెళ్తుండడంతో వీటికి మరింత బలం చేకూరుస్తోంది. కానీ... పాక్ లో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని మునీర్ చెబుతున్నారు.

మరోవైపు ఇటీవల పాక్ తో చమురు ఒప్పందం జరిగిందని అమెరికా అధ్య్క్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మునీర్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని.. వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని.. ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరుతుందని చెప్పుకొచ్చారు.

కాగా... ఆపరేషన్ సిందూర్ అనంతతర ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాక్ నుంచి కాల్పుల విరమణ రిక్వస్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరిచిన మునీర్... ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్రలు చేస్తే దాడులు చేస్తామని బెదిరించడం గమనార్హం!