Begin typing your search above and press return to search.

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందంట.. పాక్ బీరాలు పీక్స్!

అవును... తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Raja Ch   |   17 Oct 2025 2:00 PM IST
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందంట.. పాక్ బీరాలు పీక్స్!
X

పాకిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాలు పలుచోట్ల పరస్పరం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. దాంతో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. అయితే బుధవారం సాయంత్రం 6:00 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది.. ఇది నాటి నుంచి 48 గంటల్లో ముగుస్తుంది. ఈ సమయంలో... ఆఫ్గన్ దెబ్బకు కుయ్యో మొర్రో అంటున్న పాక్.. మరోవైపు భారత్ పై తన అక్కసు వెల్లగక్కుతుంది.

ఇందులో భాగంగా... సరిహద్దుల్లో పాకిస్థాన్ పై తాలిబాన్లతో భారత్ ప్రాక్సీ యుద్ధం చేయిస్తుందంటూ నోరు పారేసుకుంటుంది. ఆఫ్గాన్ నిర్ణయాలు కాబుల్ లో కాకుండా ఢిల్లీలో తీసుకుంటున్నారని రకరకాల మాటలు మాట్లాడుతున్నా పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ పై పిచ్చి ప్రేలాపనలు పేలారు. ఇదే సమయంలో భారత్, ఆఫ్గన్ లతో ఏకకాలంలో యుద్ధానికి సిద్ధం అని చెప్పుకొచ్చారు.

అవును... తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి వివాదానికి తెరలేపారు. ఇందులో భాగంగా... భారత్‌ తో కూడా సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైతే..? అనే ప్రశ్నకు... ద్విముఖ యుద్ధానికి పాకిస్థాన్‌ సిద్ధంగా ఉందని.. అందుకు తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని.. అయితే వాటి గురించి చర్చించనని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే భారత్ పై నోరు పారేసుకున్నారు. ఇందులో భాగంగా... సరిహద్దు వెంబడి భారత్‌ డర్టీ గేమ్స్ ఆడేందుకు అవకాశాలున్నాయంటూ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. తమ దేశంలో నివసిస్తోన్న అఫ్గాన్ శరణార్థులను లక్ష్యంగా చేసుకున్న ఆసిఫ్... వారివల్ల పాక్‌ కు ఎలాంటి ఉపయోగం లేకపోగా.. వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు.. వారు వెంటనే పాక్ దేశాన్ని వీడాలని అన్నారు.

ఫ్రాక్సీ కబుర్లకు కౌంటర్ ఇచ్చిన భారత్!:

అంతకుముందు ఒక ప్రకటనలో.. తాలిబాన్ ప్రభుత్వం భారతదేశం తరపున తమపై 'ప్రాక్సీ యుద్ధం' చేస్తోందని ఆసిఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... తాలిబాన్ నిర్ణయాలు ఢిల్లీ స్పాన్సర్ చేస్తున్నందున, కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అనే దానిపై తమకు సందేహాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ఇందులో భాగంగా... పాక్‌ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యమిచ్చి వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని.. తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించటం ఆ దేశానికున్న పాత అలవాటని చెబుతూ... ఆఫ్గనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ఉట్టికి ఎగరలేకపోయినా...!!:

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ఒక్కసారిగా వణికిపోయిన సంగతి తెలిసిందే. ఆ యుద్ధంలో భారత క్షిపణులు ఇస్లామాబాద్ ను టచ్ చేసిన పరిస్థితి. దీంతో... అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సీజ్ ఫైర్ కోసం భారత్ ను ఒప్పించమని రిక్వస్ట్ చేసుకుంది పాక్! మరోవైపు భారత దేశ సైన్యాధికారులకు ఫోన్ చేసి బ్రతిమాలుకుంది. ఆ సమయంలో భారత్ కరుణించి వదిలేసిన సంగతి తెలిసిందే!

మరోవైపు.. పాక్ సైన్యానికి గత కొన్ని రోజులుగా ఆఫ్గాన్ సైన్యం చుక్కలు చూపిస్తోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యాన్ని వణికించెస్తోంది. ఇందులో భాగంగా... బుధవారం ఉదయం పాకిస్థాన్ సైన్యాన్ని బంధించడంతో పాటు.. ఆ దేశ యుద్ధ ట్యాంకులతో వీధుల్లో ర్యాలీలు నిర్వహించి, పాక్ సైనికుల ప్యాంటులను నడిరోడ్డుపై ప్రదర్శించి విజయోత్సవాలు జరుపున్న పరిస్థితి.

దీంతో... ఆఫ్గన్ తో యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్దకు మరోసారి పరుగెత్తింది పాక్. ఈ సందర్భంగా ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపిన ట్రంప్, ఈ తొమ్మిదో యుద్ధాన్ని ఆపుతానంటే స్వాగతం అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అలాంటి పాక్... అటు భారత్ తోనూ, ఇటు ఆఫ్గన్ తోనూ ఏకకాలంలో యుద్ధానికి సిద్ధమని ప్రకటించడం.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట అన్నట్లుగా ఉందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది!