Begin typing your search above and press return to search.

ఈయన చాలు... ప్రపంచ పటంపై పాక్ లేకుండా చేయడానికి !

ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఈ పేరు అంతర్జాతీయ స్థాయిలో చాలా మందికి ఈ ఏడాది ఏప్రిల్ తరువాతనే తెలిసింది.

By:  Satya P   |   19 Oct 2025 9:07 AM IST
ఈయన చాలు... ప్రపంచ పటంపై పాక్ లేకుండా చేయడానికి !
X

ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఈ పేరు అంతర్జాతీయ స్థాయిలో చాలా మందికి ఈ ఏడాది ఏప్రిల్ తరువాతనే తెలిసింది. దానికి కారణం భారతదేశం మీద ఉగ్ర దాడికి ప్రోత్సహించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు పహల్గాం దాడి ఆయన రచన అని అనే వారు ఎక్కువ మందే. ఆయన కూడా భారత్ మీద విషం చిమ్ముతూ తానేంటో ఎప్పటికపుడు రుజువు చేసుకుంటూ వస్తున్నారు. పహిల్గాం దాడి తరువాత భారత్ లో 27 మంది పర్యాటకులు మరణించవచ్చు. అది అత్యంత బాధాకరం ఎంతో విషాదకరమైన అంశం. కానీ ఆపరేషన్ సింధూర్ తో పాక్ కి ఇచ్చిన జెల్లకాయ మాత్రం ఇటీవల కాలంలో కోలుకోలేనిదే అయింది.

భారీ షాక్ ఇస్తూ :

పాక్ లోకి భారత్ గుండా ప్రవహించే సింధు నదీ జలాలను ఆపేసి మరీ భారత పాక్ కి తగిన గుణపాఠం చెప్పింది. దాంతో పాక్ లో పాతిక కోట్ల మంది ప్రజలను దారుణంగా ఇబ్బంది పెట్టిన వారుగా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మిగిలారు. అంతే కాదు పాక్ దారిద్ర్యానికి తోడు భారత్ మీద ద్వేషంతో ఆ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నాడీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఇది పాక్ ప్రజలకు అర్ధం అవుతుందో లేదో తెలియదు కానీ పాక్ మాత్రం ఇప్పటికే ఈయన నిర్వాకం మూలంగా భారీ మూల్యం అయితే చెల్లించింది అన్నది స్పష్టం.

మళ్ళీ పేలాపన :

అయితే పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా ప్రవర్తించడమే విశేషం. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం రేపడమే కాదు భారత్ కి తీవ్ర ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వుతున్న ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పాక్ ని ఇంకా ఏ గతి పట్టిస్తారో అన్నదే అందరి భయం కూడా.

అణు ప్రస్తావనతో :

రానున్న కాలంలో భారత్ ఏదైనా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోమని ప్రతిచర్యకు దిగుతామని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్పష్టంగా చెబుతున్నారు. పైగా అణు ప్రస్తావన కూడా ఆయన తేవడం బరితెగింపుగానే చూడాల్సి ఉంది. అణు వాతావరణంలో యుద్ధానికి తావులేదని చెఉబుతూ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చెప్పింది ఏమిటి అన్నది ఆలోచిస్తే తాము సర్వ నాశనం అయినా భారత్ మీద తమ ద్వేషాన్ని ఆపమని చెబుతున్నట్లే అంటున్నారు. అంటే అణు ప్రయోగానికి సిద్ధమని చెబుతున్నట్లుగానే ఆయన దారుణమైన వైఖరి ఉందని అంటున్నారు.

శాంతి దేశమంట :

పాక్ శాంతిని కోరుకునే దేశమని ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అనడం నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని అంటున్నారు. ఆయన ఈ తీరుగా రెచ్చిపోతూ చేస్తున్న ప్రకటనలు అన్నీ కూడా భారత్ ని ఏదో చేద్దామని అయితే ఉండొచ్చు. కానీ అదే సమయంలో పాక్ ప్రపంచ చిత్ర పటంలో లేకుండా చేసేందుకు ఆయన తన వంతుగా ఆజ్యం పోస్తున్నారు అని అంటున్నారు. పాక్ కి ఇప్పటికే శతృవులు ఇరుగు పొరుగు ఉన్నారు. పాక్ కి అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆఫ్ఘాన్ తో యుద్ధం ఉంది. అయినా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ బరితెగించి చేస్తున్న విమర్శలు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చూసిన వారు అంతా ఈయన వల్లనే పాక్ సర్వనాశనం అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.