Begin typing your search above and press return to search.

వి. కామకోటికి పద్మశ్రీ... సోషల్ మీడియాలో ఇంత రచ్చ ఎందుకు..!

అక్కడ స్వదేశీ జ్ఞాన వ్యవస్థలు, సేంద్రీయ వ్యవసాయం గురించి చర్చిస్తూ గోమూత్రం యొక్క ఔషధ గుణాల గురించి కామకోటి మాట్లాడారు.

By:  Raja Ch   |   27 Jan 2026 3:20 PM IST
వి. కామకోటికి పద్మశ్రీ...  సోషల్  మీడియాలో ఇంత రచ్చ ఎందుకు..!
X

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటికి 'పద్మశ్రీ' అవార్డు ప్రకటించడం రాజకీయ వివాదానికి దారితీసింది! ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెటకారంతో కూడిన విమర్శలు చేయగా.. అందుకు పలువురు మద్దతుగా వ్యాఖ్యానించగా.. తాజాగా జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ ఎంట్రీతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా... గోమూత్రంపై కామకోటి గతంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

అవును... ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటికి పద్మశ్రీ అవార్డు రావడంపై కేరళ కాంగ్రెస్ యూనిట్ స్పందించింది. ఇందులో భాగంగా.. 'వి. కామకోటికి గౌరవం లభించినందుకు అభినందనలు.. ఐఐటీ మద్రాస్ లో గోమూత్రంపై మీరు చేసిన పరిశోధనను దేశం గుర్తించింది.. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లింది' అని కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో.. గత సంవత్సరం ఒక బహిరంగ కార్యక్రమంలో గోమూత్రంపై కామకోటి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పోస్ట్ ప్రస్తావించింది!

అక్కడ స్వదేశీ జ్ఞాన వ్యవస్థలు, సేంద్రీయ వ్యవసాయం గురించి చర్చిస్తూ గోమూత్రం యొక్క ఔషధ గుణాల గురించి కామకోటి మాట్లాడారు. అయితే.. .ఈ వ్యాఖ్యలు గతంలో ప్రతిపక్ష నాయకులు, హేతువాద సమూహాల నుండి విమర్శలను ఎదుర్కొన్నాయి. ఒక ప్రముఖ సాంకేతిక సంస్థ అధిపతికి తగని అశాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. డీఎంకే, అన్నాడీఎంకే సైతం ఐఐటి డైరెక్టర్ నుండి అలాంటి ప్రకటనల సముచితతను ప్రశ్నించారు!

ఈ సమయంలో... జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. వి. కామకోటి గోమూత్రంపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో... కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ ను తగులుకుంది. ఈ సందర్భంగా.. మీరు గోమూత్రం ప్రయోజనాలను నమ్మే బిలియనీర్ కాబట్టి, మీ కంపెనీ సరైన ఆవు మూత్రం, పేడ పరిశోధనలో ఎందుకు పెట్టుబడి పెట్టదు? ఆవు మూత్రం క్యాన్సర్‌ ను నయం చేయడంలో సహాయపడితే.. అది ప్రపంచానికి మనం చేసిన గొప్ప సహకారాలలో ఒకటి అవుతుంది అని ట్వీట్ చేసింది.

అదేవిధంగా... కోవిడ్-19ను ఉటంకిస్తూ.. మహమ్మారి సమయంలో ఆవు పేడ, గోమూత్రం ఉపయోగించి వైరస్‌ ను చంపడానికి ప్రయత్నించిన అనేక మంది మోసగాళ్ళు ఉద్భవించారని కాంగ్రెస్ పేర్కొంది. మేకలు, గేదెలు, మనుషుల విసర్జనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎగతాళి చేసింది! క్యాన్సర్ పరిశోధన మనకు అవసరమనడంలో సందేహం లేదు. కానీ ఆవు పేడ లేదా ఆవు మూత్రం మాత్రమే క్యాన్సర్‌ ను నయం చేయగలదని మీరు ఎందుకు పట్టుబడుతున్నారు? అని ప్రశ్నించింది.

దీనిపైనా శ్రీధర్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... తాను కామకోటి శాస్త్రీయ ప్రాతిపదికను సమర్థించాను.. తాను మళ్ళీ అలాగే చేస్తాను! ఆవు పేడ, ఆవు మూత్రం మానవులకు విలువైన అద్భుతమైన మైక్రోబయోమ్‌ ను కలిగి ఉంటాయి.. ఏదో ఒక రోజు, హార్వర్డ్ లేదా ఎంఐటీ దీనిపై ఒక అధ్యయనాన్ని ప్రచురించినప్పుడు, ఈ బానిస మనసులు దానిని సువార్త సత్యంగా ఆరాధిస్తాయి అని జోహో సహ వ్యవస్థాపకుడు ట్వీట్ చేశారు. దీంతో.. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుందనే కామెంట్లు సొంతం చేసుకుంటుంది.