వీరే ఈ ఏడాది పద్మశ్రీలు.. తెలంగాణ నుంచి ఇద్దరు
ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
By: Tupaki Political Desk | 25 Jan 2026 5:42 PM ISTఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీకి ఈసారి 45 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు రెండు పురస్కారాలు దక్కినా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్కరికీ రాలేదు. తమిళనాడు నుంచి ఏకంగా ఐదుగురిని అవార్డు వరించింది. తెలంగాణలో.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తో పాటు మామిడి రామారెడ్డిలను పద్మశ్రీ వరించింది. వీరిలో కుమారస్వామి సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మైక్రో బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త. 30 ఏళ్లుగా ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచారు. మనుషుల పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై పెద్దఎత్తున పరిశోధనలు చేశారు. మరోవైపు రామారెడ్డి పశు సంవర్ధక, పాడిపరిశ్రమలో చేసిన ప్రయత్నాలకు పురస్కారం దక్కింది. ఇక పురస్కారాల పూర్తిజాబితా విడుదల కావాల్సి ఉంది. మొత్తం 54 మందికి పద్మశ్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రాల వారీగా ఇలా...
అంకెగౌడ, సురేశ్ హన్గవాడి (కర్ణాటక), అర్మిడ ఫెర్నాండెజ్, బ్రికల్యాభట్, రఘువీర్ తుకారాం ఖేడ్కర్ (మహారాష్ట్ర), భగవాన్ దాస్ రాయికర్, కైలాశ్ చంద్రపంత్ (మధ్యప్రదేశ్), బ్రిజ్ లాల్ భట్ (కశ్మీర్), బుద్రి తాటి (ఛత్తీస్ గఢ్), చరణ్ హెంబ్రామ్ (ఒడిశా), చిరంజిలాల్ యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్), ధార్మిక్ లాల్ చునిలాల్ పాండ్యా (గుజరాత్), గఫ్రుద్దీన్ మెవాటి జోగి (రాజస్థాన్), హాలీవార్ (మేఘాలయ), ఇంద్రజిత్ సింగ్ సిద్దు (చండీగఢ్), కె.పజ్నీవెల్ (పుదుచ్చెరి), ఖేమ్రాజ్ సుంద్రియాల్ (హరియాణా), కొల్లాక్కయిల్ దేవకి అమ్మాజీ (కేరళ), మహేంద్ర కుమార్ మిశ్రా (ఒడిశా), మిర్ హాజీభాయ్ కసమ్ బాయ్ (గుజరాత్), మోహన్ నాగర్ (మధ్యప్రదేశ్), నరేష్ చంద్రవర్మ(త్రిపుర), నీలేష్ చంద్ర మండేవాలా (గుజరాత్), నూరుద్దీన్ అహ్మద్ (అసోం), ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్ (తమిళనాడు), పద్మ గుర్మీత్ (లద్దాఖ్), షోకిలా లెక్తెపి (అసోం), పుణ్యమూర్తి నటేషణ్ (తమిళనాడు), ఆర్.క్రిష్ణన్ (తమిళనాడు), రఘుపత్ సింగ్ (యూపీ), రాజ స్తపతి కలియప్ప గౌండర్ (తమిళనాడు), రామచంద్ర గోడ్బలే (చత్తీస్‌గఢ్), ఎస్జీ సుశీలమ్మ (కర్ణాటక), సంగ్యుసంగ్ పొంగెరన్ (నాగాలాండ్), షఫీషౌక్ (కశ్మీర్), దేవ్బా లాడ్ (మహారాష్ట్ర), శ్యాంసుందర్ (యూపీ), సింహాచల్ పాత్రో(ఒడిశా), టాగరామ్ భీల్ (రాజస్థాన్), తేచి గుబిన్ (అరుణాచల్ ప్రదేశ్), తిరువర్రూర్ భక్తవత్సలం (తమిళనాడు), విశ్వబంధు (బిహార్), ముమ్నామ్ జాత్ర సింగ్ (మణిపుర్).
