Begin typing your search above and press return to search.

హోటల్ లో దొరికిన భార్య.. నగ్నంగా పరుగెత్తిన ప్రియుడు.. ట్విస్ట్ ఏమిటంటే..!

ఈ సమయంలో.. ఓయో రూమ్ లో ప్రియుడితో దొరికేసిన అనంతరం, అతడిపైనే కేసు పెట్టిన ఓ మహిళ వ్యవహారం ఈ చర్చకు కారణమైంది!

By:  Raja Ch   |   29 July 2025 3:54 PM IST
హోటల్ లో దొరికిన భార్య.. నగ్నంగా పరుగెత్తిన ప్రియుడు.. ట్విస్ట్ ఏమిటంటే..!
X

మహిళల రక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టాలను పలువురు దుర్వినియోగ పరుస్తున్నారని.. ఫలితంగా వాటిని ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం వృథా అవుతుందని.. పలు తప్పుడు ఫిర్యాదుల వల్ల, నిజంగా సమస్యలో ఉన్నవారిని సైతం అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయనే చర్చ ఇటీవల జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు గృహహింస కేసులను ప్రస్థావిస్తుంటారు!

ఈ క్రమంలో తాజాగా.. మహిళల లైంగిక వేదింపులకు సంబంధించి ఏర్పాటు చేసిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని.. దీనివల్ల నిజమైన లైంగిక వేధింపుల కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో.. ఓయో రూమ్ లో ప్రియుడితో దొరికేసిన అనంతరం, అతడిపైనే కేసు పెట్టిన ఓ మహిళ వ్యవహారం ఈ చర్చకు కారణమైంది!

అవును... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలోని ఓ ఓయో హోటల్‌ లో ఓ కీలక సంఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆ రూమ్ లో ఉండగా... సరిగ్గా ఆ సమయంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇద్దరూ నగ్నంగా ఉండగా.. అకస్మాత్తుగా సీన్‌ లోకి ఫ్యామిలీ ఎంటర్ అయింది.

ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చిన భర్త... భార్య ఉన్న ఓయో హోటల్‌ కు వచ్చి తలుపు తట్టాడు. ఈ క్రమంలో బలవంతంగా తలుపు తెరవగా.. ఆమె బాత్‌ రూమ్‌ లో దాక్కుంటే.. ఆమె ప్రియుడు మాత్రం గోడ దూకి నగ్నంగానే పారిపోయాడు. ఈ సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మహిళ బాత్ రూమ్ నుంచి బయటకు వచ్చింది.

అదంతా ఒకెత్తు అయితే... ఇక్కడ ఓ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది సదరు వివాహిత. ఇందులో భాగంగా... తన ప్రియుడు తనను బలవంతంగా ఈ సంబంధంలోకి లాగాడని ఆరోపించింది. తనను వివాహం చేసుకుంటానని ప్రామిస్ చేసి శారీరకంగా వాడుకున్నాడని చెబుతూ.. అతడిపై రేప్ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే.. పైన పేర్కొన్న చర్చ మొదలైందని అంటున్నారు.

కాగా... వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీని ఉల్లంఘించడం అనేది లైంగిక దాడిగా పరిగణించబడదని పునరుద్ఘాటిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాహం అనే నెపంతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించబడిన వ్యక్తిపై నమోదైన అత్యాచార కేసును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.

ఈ సందర్భంగా సదరు మహిళ నిందితుడితో కలిసి మూడుసార్లు హోటల్ గదికి వెళ్లిందని, ఈ క్రమంలో అతడు మోసం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది! ఏది ఏమైనా... ఇప్పటికే వివాహమై, ప్రియుడితో హోటల్ గదికి వెళ్లి, దొరికిపోయిన తర్వాత తిరిగి అతడిపై రేప్ కేసు పెట్టడంతో... అసలైన లైంగిక వేదింపులు, తప్పుడు ఆరోపణలపై చర్చ మొదలైందని అంటున్నారు!