ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్, విజయవాడ.. కారణమేంటి?
గుజరాత్‌లోని సూరత్ అగ్రస్థానంలో నిలిచింది. 2035 నాటికి ఈ నగరం GDP $126.8 బిలియన్లు చేరనున్నట్లు అంచనా.
By: A.N.Kumar | 5 Nov 2025 8:00 PM ISTఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక (2019–2035) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో భారత్ అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ జాబితాలో టాప్ 10 నగరాలన్నీ భారతదేశానివే కావడం విశేషం. వీటిలో చాలావరకు టైర్-2, టైర్-3 నగరాలు ఉండటం భారత ఆర్థిక ప్రగతిలో అద్భుతమైన ఉత్సాహాన్ని సూచిస్తోంది.
* టాప్ 3: సూరత్, ఆగ్రా, బెంగళూరు
గుజరాత్‌లోని సూరత్ అగ్రస్థానంలో నిలిచింది. 2035 నాటికి ఈ నగరం GDP $126.8 బిలియన్లు చేరనున్నట్లు అంచనా. రెండో స్థానంలో ఆగ్రా ఉంది. మూడో స్థానంలో ఐటీ హబ్ అయిన బెంగళూరు ఉంది. ఈ నగరానికి 8.5% వృద్ధి రేటు ఉండనుంది.
* తెలుగు నగరాల జోరు: హైదరాబాద్, విజయవాడ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ అగ్రశ్రేణి నగరాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దీని వృద్ధి రేటు: 8.2% 2035 నాటికి GDP అంచనా $201.4 బిలియన్లుగా ఉండనుంది. ఈ అంచనా హైదరాబాద్‌ను ప్రపంచ వ్యాపార రంగంలో కీలక ఆటగాడిగా నిలబెట్టే దిశగా ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ టాప్-10 జాబితాను పూర్తి చేస్తూ పదో స్థానంలో నిలిచింది. దీని వృద్ధి రేటు 8.2%. 2035 నాటికి GDP అంచనా $21.3 బిలియన్లుగా ఉంది.
2018లో కేవలం $5.6 బిలియన్ల వద్ద ఉన్న విజయవాడ ఆర్థిక పరిమాణం, 2035 నాటికి దాదాపు నాలుగింతలు పెరగనుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల పెరుగుదలకు నిదర్శనం.
* జాబితాలో ఇతర భారతీయ నగరాలు
తదుపరి స్థానాల్లో నాగ్‌పూర్, తిరుప్పూర్, రాజ్‌కోట్ ఉన్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి (8.3% వృద్ధి) ఎనిమిదో స్థానంలో ఉంది.. చెన్నై (8.2% వృద్ధి) తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఇది తమిళనాడులోని చిన్న నగరాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తోంది.
* తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం
ఈ జాబితాలో హైదరాబాద్, విజయవాడ రెండు నగరాలు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం. రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాయని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తోంది.
