షాకింగ్ ఫ్యాక్ట్.. ఎక్కువ మాట్లాడితేనే రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుందా?
వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ప్రేమ పేరుతో పార్ట్‌నర్‌కు ఊపిరాడకుండా చేసే ఈ ఓవర్ కమ్యూనికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, అసలు మార్పు ఎవరిలో రావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
By: Madhu Reddy | 24 May 2026 9:00 PM ISTబంధాలు బలంగా ఉండాలంటే మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటారు. కానీ, ఇప్పుడు కథ మారింది. అతిగా మాట్లాడటం, క్షణం గ్యాప్ లేకుండా మెసేజ్‌లు చేసుకోవడం వల్లే చాలా రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతున్నాయట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ప్రేమ పేరుతో పార్ట్‌నర్‌కు ఊపిరాడకుండా చేసే ఈ ఓవర్ కమ్యూనికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, అసలు మార్పు ఎవరిలో రావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ మాట్లాడితేనే బ్రేక్ అవుతుందా?:
అవును, ప్రేమికులు లేదా భార్యాభర్తలు రోజంతా ఫోన్లలోనే గడపడం ఈ రోజుల్లో ఎక్కువైంది. ఇక ఆఫీస్ లో బ్రేక్ దొరికినా, ఖాళీ సమయం ఉన్నా వాట్సాప్‌లో చాటింగ్‌లు, వీడియో కాల్స్ లాగించేస్తున్నారు. రిలేషన్ మొదట్లో ఇది బాగున్నా, రానురాను ఇదే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అతిగా మాట్లాడటం వల్ల ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ తగ్గి, గొడవలు మొదలవుతున్నాయి.
వాట్సాప్ రిప్లైల గోల.. అభద్రతాభావం:
"మెసేజ్ చూసి కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు?", "ఆన్‌లైన్‌లో ఉండి ఎవరితో మాట్లాడుతున్నావ్?"... ప్రస్తుత రిలేషన్స్‌లో ఇవే పెద్ద గొడవలు. ఇక క్షణాల్లో రిప్లై ఇవ్వాలనే రూల్ పెట్టుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఒత్తిడి పెరుగుతోంది. పనిలో వుంది రిప్లై ఇవ్వకపోతే అంతేసంగతులు. ఇక ఇది ప్రేమ కంటే ఒకరిపై ఒకరు నిఘా పెట్టినట్టు ఫీలింగ్ ఇద్దరిలో కలుగుతోంది.
పర్సనల్ స్పేస్ లేకపోతే అంతే సంగతులు:
ప్రతి మనిషికి కొంత పర్సనల్ స్పేస్ కావాలి. ఆఫీస్ టెన్షన్లు, పర్సనల్ పనులు ఉన్నప్పుడు కూడా భాగస్వామి ఫోన్ చేసి విసిగిస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇక ఎప్పుడూ టచ్‌లో ఉండటం వల్ల ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ తగ్గిపోతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతుంది.
క్వాంటిటీ కాదు.. క్వాలిటీ ముఖ్యం:
రోజంతా వంద మెసేజ్‌లు పంపుకోవడం కంటే, రోజులో పది నిమిషాలు ప్రశాంతంగా, మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా మేలు చేస్తుంది. ఇక అనవసరపు విషయాలు మాట్లాడి గొడవలు పడటం కంటే, ఇద్దరి కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి అర్థవంతమైన చర్చలు జరపడం రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్ చేస్తుంది.
మార్పు ఎవరిలో రావాలి?:
ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇద్దరిలోనూ మార్పు రావాలి. ప్రేమ అంటే 24 గంటలు ఫోన్ కి అతుక్కుపోవడం కాదని గ్రహించాలి. ఇక అవతలి వ్యక్తి మూడ్, వారి బిజీ లైఫ్‌ను గౌరవించడం నేర్చుకోవాలి. పార్ట్‌నర్‌కు కాస్త ఫ్రీ టైమ్ ఇస్తే, వాళ్లే తిరిగి మన దగ్గరకు వస్తారనే నమ్మకం ఇద్దరిలోనూ ఏర్పడాలి.
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఇది రిలేషన్‌షిప్స్‌కు కూడా వర్థిస్తుంది. మాట్లాడటం బంధానికి ఎంత అవసరమో, ఎప్పుడు ఆపాలో తెలియడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, మీ పార్ట్‌నర్‌కు కాస్త స్పేస్ ఇవ్వండి... మీ ప్రేమను మరింత కాలం పదిలంగా ఉంచుకోండి అంటున్నారు నిపుణులు.
